Wednesday, May 5, 2021

శివోహం

బంధాలు...
భాద్యతలు...
ప్రేమలు...
అభిమానాలు అన్ని జగన్నాటకంలో మొహాలు...
ఈ బతుకు పయనంలో...
మన రాక ఒంటరే...
పోక ఒంటరే...
చివరికి మనకి మనమే మిగిలేది...

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, May 4, 2021

శివోహం

శంభో!!!
నీతో ముడిపడి ఉండే ఆత్మ బంధాన్ని మాత్రమే  అమృతమవనీ...
భౌతిక ప్రలోభాల మాయలో పడి అప్పుడప్పుడు ఆత్మ బంధమని అనుకొన్నవాటిని నీ త్రినేత్రంతో  కాల్చివేయి...

మహాదేవా శంభో శరణు...

Monday, May 3, 2021

శివోహం

శంభో...
నీకు ఎన్నో వేల పేర్లు ఉన్నాయని పెద్దలు చెప్పగా విని ఉంటి...
కాని అందులో శివ అనే పేరు మాత్రమే నా గుండెల్లో నిండుగా మెండుగా దండిగా పేరుకొని పోయింది...
నీ గురించిన తత్వ భావ సంపద నేనెరుగను...
మందబుద్ది కలవాడను నేను... 
సర్వజ్ఞుడువి నీవు నీ వద్ద ఏం దాచగలము చెప్పు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
ఏమిటి నీ లీల...
అంతా శూన్యంలాగే అనిపిస్తుంది...
ఎక్కడో ఓ మూల భయం, ఆందోళన
ఏమీ సాధించలేదు అనే బాధ...
ఓ మంత్రం రాదు, పూజ చేతగాదు
గురూపదేశం లేదు, సాధనలేదు
ఈ కట్టె ఇలా కాలిపోవాలసినదనే
కలలో కలంలో తప్ప ఇలలో కనిపించవా కపాలధారీ...

మహాదేవా శంభో శరణు...

Sunday, May 2, 2021

శివోహం

జనన మరణాలనే రెండు ఒడ్డుల కూడిన సాగరం లో  
వచ్చిపోయే కెరటాల వలె నానా జన్మల పాలై
రాగ ద్వేషాలనే సుడిగుండంలో చిక్కుకుని
భార్యా పుత్రులు , సంపదలనే వ్యామోహపు మకరాల
కోరలకు చిక్కి చితికిపోతున్న నాకు  మత్స్యరూపధారి
శివ నీవే దిక్కు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివాలయం కు వెళ్లకుండా ఉండగలవేమో కానీ....
స్మశానం కు వెళ్లకుండా ఉండగలవా...
అక్కడ ఇక్కడ ఉండేది ఒకే ఒక్కడు...
ఓం నమః శివాయ

శివోహం

నా మనసంతా బాదామయమైనప్పుడు...
నా గుండె నిండ దుఖాలు ఆవరించినప్పుడు...
మనసారా నిన్నే తలుచుకుంటాను తండ్రి...
నేను పలికే ప్రతిమాటలో నీ పేరు ఉంటుంది...
నా శ్వాసలో నీ స్మరణ ఉంటుంది...
నా ఊహల ఊయలలో నీ రూపం కనిపిస్తూనే ఉంటుంది...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...