Monday, May 10, 2021

శివోహం

భౌతిక మౌనం తేలికగా ఉన్న
నా మనసు అదుపులో లేక పరిపరి
విధముల అదుపు తప్పుతోంది పరమేశ్వరా...
నీ శరణు కోరి ని సన్నిధికి వచ్చా...

మహాదేవా శంభో శరణు...

Sunday, May 9, 2021

శివోహం

మట్టితో బొమ్మను చేసి...
మనిషిగా ప్రాణకు పోసి...
బంధానికి బంది చేసి...
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము,సర్వమూ శాశ్వతం అనే మాయను
పెంచి...
ఈ మాయ అనే ప్రాణం తీసి....
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా శివయ్యా..
ఈ జీవుడుని ఇన్ని ఆటలు ఆడిస్తూ ఏమి తెలియని అమాయకునిలా ఎట్టా  కూర్చునావయ్యా...
నీకు నీవే సాటి వెరెవ్వరయ్యా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నా ఆటలన్నీ బతుకు పోరాటం కోసం.... 
నీ ఆటలన్నీ నా భవబంధముల విడుదల కోసం..... 

మహాదేవా శంభో శరణు

అమ్మ

దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యం. సృష్టిలోని ప్రతీ జీవికి అమ్మ ఉంది...

అమ్మ అంటే అమ్మ నే
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

Saturday, May 8, 2021

శివోహం

ఏ మాట చివరిదో...
ఏ చూపు చివరిదో...
ఏ శ్వాస చివరిదో...
నీకు తప్ప ఎవరికి ఎరుక పరమేశ్వరా.. 

శివోహం

గజముఖ రూప సర్వ జ్ఞాన స్వరుప
 గణనాయక సుద్ధి బుద్ది వినాయక
ప్రధమ పూజిత పార్వతి తనయ
విజ్ఞములను తొలగించు వేద గణ నాయక
ముషిక వాహన ముని జన సేవిత ప్రియ
కోర్కెలు తీర్చు కాణిపాక కరుణ కర
కమ్మని విందు చాలు కామాక్షి ప్రియ తనయ
ఆదుకొనగ రావయ మా బాల గణపయ్య
ఇహ లోక ముక్తికి నినామమే మాకు దిక్క...
నీవే శరణు...

శివోహం

అలసిపోతున్నాను శివా...
విశ్రాంతి ఈయవా ఈశ్వరా..
ఒకడిని పంపి జతకలిపి...
ముగ్గురను చేసి బంధాల బరువులు పెంచి...
బాధ్యతల లోతులలో పడేసి ఈదమంటే ఎలా శివా...
నిన్ను స్మరించే సమయమే ఈయవా...
నిత్యం నీ నామాలాపన చేసేది ఎలా...
అలసిపోతున్నాను శివా...
విశ్రాంతి నీయవా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...