Monday, May 17, 2021

శివోహం

హనుమంతునకు శ్రీరామ నామము నిత్యఔషధం...
నారదునకు  నారాయణ  నామము నిత్యఔషధం...
నాకు ని నామము నిత్యఔషధం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ధర్మం అంటే...
అజ్ఞానము అవివేకముతో
అవివేకము అభిమానముతో
అభిమానము క్రోధముతో
క్రోధము కర్మతో
కర్మ జన్మతో
జన్మ దు:ఖముతొ కూడి  యున్నవని
తెలుసుకోవటమే ధర్మం...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివారాధనకు
ఐశ్వర్య
ఆడంబరం
అక్కర లేదు...
శివుణ్ణి తలవాలి అనే మంచి మనసు ఉంటే చాలు...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, May 16, 2021

శివోహం

ఇంద్రియాలు ఇబ్బందిగా తరుముతూ ఉండగా...
కర్మ బంధాలు తాళ్లతో కట్టివేయు చుండగా... 
నీ శరణాగతితో మన్నస్సు ప్రశాంతముగా  ఉంచుతున్న...
బంధాలు విడువక నిన్నే ప్రార్దిస్తు ఉన్నా...

మహాదేవా శంభో శరణు

శివోహం

శంభో...
యుగాంతాలయినా ఆగని పయనమిది...
నీ రచనలు చదవలేను...
నీ నాటకం నేను ఆడలేను...
తరచూ ఓడిపోలేను...
నన్ను గెలిపించు...
మహాదేవా శంభో శరణు...

Saturday, May 15, 2021

శివోహం

కరుణ హృదయిని
లోకకళ్యాణకారిణి
అఖండ శక్తిస్వరూపిణి
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

శివోహం

నాలో నీవు ఉన్నావు ఇది శివ శాసనం
నీతో నేను ఉండాలి ఇదీ శివ శాసనమే
కానీ నేను ఎవరి మాయలోనో పడి నీకు దూరము అయ్యాను
శ్మశానముల  పుంత లో కానీ గుర్తు రావటం లేదు
శాసనముల  శిలలు (బొమ్మ రాళ్లు)
యేదో ఒకటి వ్రాసి నీ దారికి తెచ్చుకో శివా...

మహాదేవా శంభో శరణు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...