Saturday, May 22, 2021

శివోహం

చితికి దేహం ఆహుతి...
చింతకు బతుకే ఆహుతి...
చింత వీడవేల శంభుని చెంత చేరనెలా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

రామభక్త ఆంజనేయ...
రుద్ర అవతార...
నీ అనుగ్రహమే మాకు బలం 
నీ ఆశీర్వాదమే మాకు జయం 
ఈశ్వరార్పణమే మాకు ధర్మం...

రామభక్త హనుమా జయము నియరా...

శివోహం

తల్లి ప్రత్యక్ష దైవం...
తల్లి సృష్టికి మూలం...
తల్లి శాంతికి వరం...
తల్లి రుణాన్ని తీర్చలేము..

ఓం శ్రీమాత్రే నమః

Friday, May 21, 2021

శివోహం

శంభో...
మర్కట బుద్ది కలిగిన నా మనసు...
కోర్కల వలయంలో  చిక్కి...
కర్కశ హృదయంగా  మారి...
కొరరానివి కోరుతూ ఉన్నది...
కనికరం తో కోర్కెలతో పాటు నన్ను కూడా కడతేర్చి కరుణించి నీ ముందు దీపం లా వేలిగిలా అనుగ్రహించు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నమో వేంకటేశా...
నమో శ్రీనివాసా...
నమో తిరుమలేశా...
నమో చిద్విలాసా...
నమో ఆదిపురుషా...
నమో కలియుగేశా...
నమో విశ్వరూపా...
నమో లక్ష్మీనాథ...
ఆపద మొక్కులవాడా...
అనాథరక్షకా...
గోవిందా గోవిందా

ఓం నమో వెంకటేశయా...

శివోహం

కల్లాకపటం ఎరుగనివాడు....
కనికరముగా మముగాచేవాడు.....
నంది నెక్కి నడయాడేవాడు...
నాగాహారముల నొప్పెడివాడు....

ఓం శివోహం..... సర్వం శివమయం......

శివోహం

శివ నామం చేయండి...
ఆస్వాదించండి...
ఆస్వాదించి ఆనందించండి...
ఆనందించి తరించండి...

ఓం నమః శివాయ...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...