Sunday, May 23, 2021

శివోహం

శబ్దం
నిశ్శబ్దం
ఆ రెండు ఊపిరుల నడుము నా తోడు నీవే కదా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Saturday, May 22, 2021

శివోహం

సకలభూతాలలో ఉండే జీవశక్తివి నీవు...
సర్వాంతర్యామిగా ఉండే కలియుగ దైవం నీవు...
సర్వానికి జ్ఞానం అందించే వేదశక్తివి నీవు...
ధైర్యాన్న నింపి అధైర్యాన్ని తోలగించి....
చెడును తొలగించి మంచిని అందించే దేవదేవుడి నీవు...

హరిహరపుత్ర అయ్యప్ప దేవా శరణు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

లాభనష్టాలు, చావుపుట్టుకలు ఈశ్వరుని మాయ...
మరి మన కర్తవ్యం మాయల సృష్టికర్త పరమేశ్వరుని ధ్యానించటం...

ఓం నమః శివాయ

శివోహం

చితికి దేహం ఆహుతి...
చింతకు బతుకే ఆహుతి...
చింత వీడవేల శంభుని చెంత చేరనెలా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

రామభక్త ఆంజనేయ...
రుద్ర అవతార...
నీ అనుగ్రహమే మాకు బలం 
నీ ఆశీర్వాదమే మాకు జయం 
ఈశ్వరార్పణమే మాకు ధర్మం...

రామభక్త హనుమా జయము నియరా...

శివోహం

తల్లి ప్రత్యక్ష దైవం...
తల్లి సృష్టికి మూలం...
తల్లి శాంతికి వరం...
తల్లి రుణాన్ని తీర్చలేము..

ఓం శ్రీమాత్రే నమః

Friday, May 21, 2021

శివోహం

శంభో...
మర్కట బుద్ది కలిగిన నా మనసు...
కోర్కల వలయంలో  చిక్కి...
కర్కశ హృదయంగా  మారి...
కొరరానివి కోరుతూ ఉన్నది...
కనికరం తో కోర్కెలతో పాటు నన్ను కూడా కడతేర్చి కరుణించి నీ ముందు దీపం లా వేలిగిలా అనుగ్రహించు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.