Monday, May 24, 2021

శివోహం

అతడు బేసి కన్నుల వాడు....
గోచిపాత వాడు...
అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరుడు...
చర్మమే ఆయన దుస్తులు...
భస్మమే ఆయన ఆభరణాలు...
స్మశానమే ఆయన ఇల్లు...
భూతప్రేతలు ఆయన మిత్రులు ........
లోకాల కోసం నేను విషాన్నిమింగేస్తాడు నా బోళాశంకరుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, May 23, 2021

శివోహం

మోక్ష ప్రాప్తికై జీవుడు చాలా కష్టపడాలి...
గట్టి ప్రయత్నం చేయాలి...
చింతల వలయం నుండే బయటకు రావాలి...
మాలిన్యం తొలిగించి నిర్మల మైన మనస్సుతో 
పరమేశ్వరుదీని హృదయం లో స్మరిస్తే మోక్షమే...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శబ్దం
నిశ్శబ్దం
ఆ రెండు ఊపిరుల నడుము నా తోడు నీవే కదా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Saturday, May 22, 2021

శివోహం

సకలభూతాలలో ఉండే జీవశక్తివి నీవు...
సర్వాంతర్యామిగా ఉండే కలియుగ దైవం నీవు...
సర్వానికి జ్ఞానం అందించే వేదశక్తివి నీవు...
ధైర్యాన్న నింపి అధైర్యాన్ని తోలగించి....
చెడును తొలగించి మంచిని అందించే దేవదేవుడి నీవు...

హరిహరపుత్ర అయ్యప్ప దేవా శరణు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

లాభనష్టాలు, చావుపుట్టుకలు ఈశ్వరుని మాయ...
మరి మన కర్తవ్యం మాయల సృష్టికర్త పరమేశ్వరుని ధ్యానించటం...

ఓం నమః శివాయ

శివోహం

చితికి దేహం ఆహుతి...
చింతకు బతుకే ఆహుతి...
చింత వీడవేల శంభుని చెంత చేరనెలా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

రామభక్త ఆంజనేయ...
రుద్ర అవతార...
నీ అనుగ్రహమే మాకు బలం 
నీ ఆశీర్వాదమే మాకు జయం 
ఈశ్వరార్పణమే మాకు ధర్మం...

రామభక్త హనుమా జయము నియరా...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...