Sunday, May 30, 2021

శివోహం

తనువులో ముళ్ళు...
మనసులో కుళ్ళు...
ఎంగిలాకు బతుకుళ్ళు...
ఉండేది కల్ముషలోగిళ్ళు...
రోగాలతో వళ్ళు...
మరణశయ్యపై చేరేవాళ్ళు మేము...
మా మీద ని ప్రతాపం ఏంటి ఈశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నీనామమే గానముగా...
నీగానమే ప్రాణముగా...
జపించి తపించువాడాను...
అడుగు అడుగున అడ్డంకులు కల్గించి
అయినదానికి కానిదానికి పరీక్షలు పెట్టకయ్యా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మనం అంతమయ్యే వరకు...
అన్ని అనుభవించాల్సిందే...
అవి  బాధలైనా ,సంతోషలైన...
ఎందుకంటే ఆపదకి  సంపద నచ్చదు...
సంపదకి బంధాలు నచ్చవు...
బంధాలకి  బాధలు నచ్చవు...
బాధలు లేని బ్రతుకే లేదు...
బ్రతుక్కి చావు నచ్చదు...
ఇన్ని నచ్ఛకున్నా మనల్ని నలుగురు మోసే వ్యక్తుల మనసులో ప్రేమ సంపాదించనప్పుడు మనం  బ్రతికివున్న శవమే....
ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, May 29, 2021

శివోహం

నా హృదయంలో తిష్టవేసి కూర్చున్నది నీవే....
నా ఆవేదన ను అరదనగా అందుకునే దేవదేవుడు నీవే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అమ్మ కడుపులో ఆడుకొని
ఓడ్యాణ పీఠాన్ని దాటుకుని
విశ్వమంత నీ ఒడిలో ఎదిగిన నాకు ఈ పాశాలు, కట్టులు నన్నేమి చేయగలవు శివ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నా హృదయంలో తిష్టవేసి కూర్చున్నది నీవే....
నా ఆవేదన ను అరదనగా అందుకునే దేవదేవుడు నీవే...

మహాదేవా శంభో శరణు...

Friday, May 28, 2021

శివోహం

ఉరకల పరుగుల ప్రపంచంలొ...
గమ్యం తెలియని ప్రయాణంలొ నా కాళ్లు పరుగెడుతున్నాయి.
పరుగాపితే ప్రయాణం ముగిసిపొతుందనే భయం... పయనం ఎటువైపో తెలియకపోయినా పరుగె అలవాటైపోయింది...
ఈ పరుగుపందెంలొ నా నీడ కూడా నాకు ఎదురు నిలవకూడదు అనే కసితొ పరుగెడుతున్నా....

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...