Sunday, June 6, 2021

శివోహం

అహం...
అహంకారం...
మొదటిది పారమార్ధికం
రెండవది ప్రాపంచికం....
అహం అంటే 'నేను' అని అర్ధం. 
ఆ అహం ఆకారంతో చేరితే అది అహంకారం.
యదార్ధ అస్తిత్వం 'నేను'. 
అపరిమితమైన 'నేను'ని పరిమితమైన మాయ ఉపాధికి చేర్చి చెప్పడం అహంకారం...

ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

ఏమైతేనేమి
ఏదైతేనేమి
మనస్సు తృప్తి పరిచే శివ నామ స్మరణే చాలు...

మహాదేవా శంభో శరణు...

Saturday, June 5, 2021

శివోహం

హరిని తలచినంతనే
తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు.
అంతేకాదు, ఆయన్ను నమ్మిన వారికి మనోబలాన్నీ, బుద్ధిని ప్రసాదిస్తాడు...
హరి నామ స్మరణ ను జపించనంతనే
సమస్త పాపాలు తొలిగిస్తాడు సదా రక్షిస్తాడు...

హరి నీవే సదా మాకు రక్ష...

శివోహం

హారుడు నాట్య ప్రియుడు...
హలహల దరుడు....
నీల కందరుండు
శుల దరుడు...
పాల లోచనుడు...
పణిహారా భుషుండు...
పాపవినాశకుండు  శివుడు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నా నమ్మకము ఒక్కటే ఈ సృష్టిలో అణువణువులో నీవు నిండి ఉన్నావు శివ...

నా ధైర్యము ఒక్కటే ఎన్ని ఆపదలు ఉన్న రక్షించే వాడవు నీవే...
శివ నీ దయ

శివోహం

భక్తి అంటే దేవుని భజించడం
అంటే భగవంతుని ప్రేమించడం
ఆరాధించడం
మనసుతో  సదా సర్వకాలం
తలుస్తూ  కొలుస్తూ ఉంటు
అదే శ్వాసగా
అదే ధ్యాసగా
అదే జీవితంగా
అదే ధ్యేయంగా ఎంచుకునే చెదరని
తరగని శాశ్వత సంపద భక్తి...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, June 4, 2021

శివోహం

భగవంతుని మీద ఇంత ప్రేమ, భక్తి ఎందుకు కలిగింది అని ప్రశ్నించుకుంటే కారణం కనబడకూడదు...

మనకు కారణం లేకుండా కోపం వస్తుంది కానీ, కారణం లేకుండా భక్తిరాదు...

కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...