Thursday, June 10, 2021

శివోహం

ఆరాటం అర్భాటంలేని అనందలోలుడవు...
ఆదర్శ, ఆత్మీయతా, ఆరాధ్యుడవు...
అందరిలో,వెలసియున్న, అత్మీయ బంధుడవు...
నీవే శరణు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

విశ్వమే లింగాకృతి...
విరూపుడవు నాకోసం ఓ రూపు ధరించి
ధరిత్రి పై నాగురించి నిలిచేవు కదా నీల కంఠేశ్వరా...

ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, June 9, 2021

శివోహం

దర్శక నిర్మాత...
వ్రాసావు నారాత...
నటనలో నడక రాక...
పడుతున్నా తికమక...
మారుతున్నవి రోజులా...
మాయదారి మనుషులా....
కాలానుగుణంగా కధలు వ్రాయక...
నాకులాంటి వాడి బాధ నీకు వేడుక...
నంది పక్కనే పడుంటాను...
పాత్ర మార్చి కరుణించవా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివుడిని
శివతత్వాన్ని
అర్థం చేసుకోవడం చాలా కష్టం....
అయితే ఆయన అనుగ్రహం పొందడం మాత్రం చాలా సులభం...

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, June 8, 2021

శివోహం

శంభో...
అందరు అడుగుతున్నారు...
నేను నిన్ను కోరిక కోరుకుంటానని...

ఎం కోరిక ఉంది నాకు...
ఎదలో ఉన్న నిన్ను ఎదురుగా చూడాలనే కోరిక
ఎదురుగా ఉన్న నిన్ను నా ఎదలో  నిలుపుకోవాలనే కోరిక తప్ప ఇంకేం కోరుకుంటా శివ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

హృదయం సంతృప్తి పడితేనే...
విశ్వమంతా ప్రేమమయం...
హృదయ దీపం వెలిగితేనే...
పృథ్విఅంతా వెలుగుమయం...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, June 7, 2021

అమ్మ

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే !
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !

అమ్మ దయా ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీ మాత్రే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...