Sunday, June 13, 2021

శివోహం

అమ్మా మాకు నీవే దిక్కు 
మీకే ఉంది కరుణించే హక్కు 
మాకు అందిచవమ్మా అమృత వాక్కు...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

పరమపురుష శ్రీపతివి...
పరిపూర్ణ లక్ష్మీ పతివి...
భక్తులకు పరమాత్మవి ..
ఈర్ష్యలేని శ్రీ వెంకటేశ్వరుడివి నీవు...
కలియుగ మానవులకు కలి మాయబాధల నుండి రక్షించే కలియుగదేవుడవు నీవే శ్రీహరి...

ఓం నమో వెంకటేశయా...

శివోహం

నీ నామ స్మరణతో జీవించే నేను...
ప్రాణం ఉన్నంత వరకు నిన్నే అరదీస్తూనే ఉంటా...మహాదేవా శంభో శరణు...

Friday, June 11, 2021

శివోహం

శంభో...
పెద్ద ఆశలు ఎమీ లేవు...
హృదయం ఉప్పొంగి నోరారా పిలుస్తా శివ అని...
నా వైపు చూడు చాలు....
నువ్వే గురువు అని నమ్మి నమస్కరిస్తా ఆదుకొని చేయి అందించి కర్తవ్యం బోధించు...
ప్రేమ తో ఓ ఆలింగనము అర్ధిస్తా....
ఆత్మీయ కౌగిలి తన్మయత్వంలో తడిపి ఉంచూ...
లోక వ్యవహారాల తో విసిగి నీ భుజము పై తలవాల్చు త... ఒక్క చిరునవ్వుతో సమ్మోహన పరచు...
నువ్వు తప్ప అన్యం మరిచిపోయే తన్మయ వర్షం తో...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

మాయ గురించి ఆలోచన కలగడమే మాయ...
మాయ నీడ లాంటిది. విడదీయడం చాల కష్టం...
మాయ ఒక బ్రమ లాంటిది మన పూర్వ జన్మ వాసనల వల్ల ఇది రక రకాల రూపాలలో వస్తుంది...
వాసనల వల్ల వ్యసనాలు ఏర్పడుతాయి మరియు మంచి బుద్ధి కూడా కలుగుతుంది...
సుధీర్గ విచారణ వల్ల మాయను తొలగించుకోవచ్చు...
ధర్మము నుంచి అధర్మము వైపునకు లాగేది మాయ. కాబట్టి ధర్మమును గట్టిగ పట్టుకొంటే మాయనుంచి బయట పడతాము...
బుద్ధి చెప్పేది ధర్మము మనసు చెప్పేది మాయ...

ఓం శివోహం సర్వం శివమయం

Thursday, June 10, 2021

శివోహం

ఆరాటం అర్భాటంలేని అనందలోలుడవు...
ఆదర్శ, ఆత్మీయతా, ఆరాధ్యుడవు...
అందరిలో,వెలసియున్న, అత్మీయ బంధుడవు...
నీవే శరణు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

విశ్వమే లింగాకృతి...
విరూపుడవు నాకోసం ఓ రూపు ధరించి
ధరిత్రి పై నాగురించి నిలిచేవు కదా నీల కంఠేశ్వరా...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...