Wednesday, June 16, 2021

శివోహం

శంభో నీ అనురాగము సాటిలేనిది...
నన్ను ఎప్పుడు కనిపెట్టి వుంటావు...
నా పాపాలను నా బాధలను ఖతం చేస్తూ ఉంటావు...
నీ దగ్గర కృతజ్ఞత ప్రకటించటానికి నాదగ్గర మాటల్లేవు...

మహాదేవా శంభో శరణు....

శివోహం

మంచి అనుకున్నది వెంటనే చేసేయ్...
చెడు అనుకున్నది ఆలోచించి అనవసరం..
అవసరం అయితే తప్ప అటువైపు అడుగులు వేయకు...
భగవంతుడు ఏది అడిగినా ఇస్తాడు....
కానీ కర్మ అనుభవించాలసినది మనమే...
అందుకే ఆలోచించి కోరుకోవాలి ఉంటారు...

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, June 15, 2021

శివోహం

నీ మనసే నీకు కష్టాలకు బాధలకు గురి చేస్తున్నది నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకో..

లేకపోతే అది నిన్ను శాంతిగా ఉండకుండా చేస్తుంది....

నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ది చేస్తూ శాంతంగా ఉండటం అలవాటు చేసుకో...

నీ మనసు శాంతిగా ఉంటేనే ఆనందం ఆ ఆనందమే పరమానందం నిజమైన ఆనందం...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

బలే ఆటగాడివి...
ఆడిస్తూవుంటావు...
మాయలో పడేస్తూ వుంటావు...
నీ సాటి నీవే మా పాలిట దైవం నీవే...
మహాదేవా శంభో శరణు...

Monday, June 14, 2021

శివోహం

అవసరం (కోరిక) నాది...
ఆశీస్సులు నీది ఈశ్వరా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఏ దైవమూ దరికి చేరని నాడు ...
నన్ను గుండెలకు హత్తుకునేది...
ఎత్తుకున్నదీ నీవే కదా తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

Sunday, June 13, 2021

శివోహం

రుద్రాయ
రుద్రనేత్రాయ...
కాలాయ
కాలసంభవాయ...
త్రిగుణాయ
త్రినేత్రభూషితాయ...
అనంతాయ
అనంతరూపాయ...
ఆద్యాయ
అద్యదేవాయ...
లింగాయ
లింగస్వరూపాయ...
నటరాజాయ
నాట్యకుషాగ్రాయ.
శివాయ
నమః శివాయ...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...