Tuesday, June 22, 2021

శివోహం

ఈశ్వరా...
పరమేశ్వరా...
నోరు నొప్పి పుట్టే వరకు...
నా మనసు సేద తీరే వరకు నీ నామమే జపిస్తున్న కదా...
నా పిలుపు విని...
నీ పిలుపు వినిపించు..

మహాదేవా శంభో శరణు...

Monday, June 21, 2021

శివోహం

త్రినేత్రా త్రిలింగ దేవా
త్రిశూల పాణీ పరమేశ్వరా...
పాపపరిహార పార్వతీపతి
మౌనము దాల్చావు
మాటాడను అంటావు
నీతో ఉండాలని నే వచ్చా...
మౌనంవీడి మాటాడు ఈశా
నీ మనసులోని భావాలు
నాకెలా తెలుసు
మహాదేవా శంభో శరణు...

Sunday, June 20, 2021

శివోహం

నిరంతర శివ నామ స్మరణే ముఖ్యమనీ 
త్రివిధ తాపం రక్షించేది పరమేశ్వరుడే అని తెలుసుకొన్నా...
శోక మోహ రాహిత్యమునకు శాస్త్రమనీ  
సంసార సాగరం దాటించేది మహాదేవా నీవేనని తెలుసుకొన్నా...
సంసార సాగరం దాటించు నీ వైపు దారి మళ్లించు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

సృష్టి, స్థితి, మరియు లయము లలో  నీవే పరమ సత్యము...
సత్యమునకు మూలము మరియు అంతము నీవే పరమేశ్వరా...
సమస్త సత్యమునకు సారము నీవే...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, June 19, 2021

శివోహం

విశ్వాసమున్న చోట ప్రేమ...
ప్రేమ గలచోట శాంతి...
శాంతి వున్న చోట సత్యము...
సత్యముగల చోట ఆనందమూ...
అక్కడే భగవంతుడు వుంటాడు...
శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారు.

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, June 18, 2021

శివోహం

జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు, పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ చలవే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నను నడిపించే వాడివి నువు నా అండ ఉండగా....
వేరెవరూ తోడు రాకపోయినా భయపడను తండ్రి...
నీవైపు నేను వేసే నా అడుగులే నాకు ఆత్మబంధువులు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...