Sunday, June 27, 2021

శివోహం

కనులారా నిన్ను చూసి
తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కక్క కానరాక ఉన్నావు...
నిన్నూ చేరుకునే సత్య ఉపాయము చెవిలో చెప్పి పోవయ్య మహేశా... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నాకు ఆధారము నీవు మాత్రమే...
ఈ బంధాలు పెనవేసుకునేవే గాని విడిపించేవి గావు...
అసలైన స్వేచ్ఛ నీ దగ్గరే ప్రభూ...
మహాదేవా శంభో శరణు...

Saturday, June 26, 2021

శివోహం

హరిహార పుత్ర అయ్యప్ప....
అజ్ఞానమనే చీకటికి నీనామము చిరుదీపముగా వెలిగించి నీరూపము కొరకు వెదుకుచుండగ...
దారితప్పిన వేళ చేయూతనిచ్చి నీవైపు నడిపించు...
ఎంత చీకటిలోనైనా(కష్టంలో)నిన్ను వదలను...
మణికంఠ దేవా నీవే నా దీపానివి...
నా ఆరాధనయే నీకు దీపారాధన...

మహాదేవా శంభో శరణు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

దండము పెట్టుట నావంతు
తప్పుల రక్షణ నీవంతు 
ధర్మము పల్కుట నావంతు
అర్ధము చెప్పుట నీవంతు   
శ్రీహరి శరణు...
ఓం నమో వెంకటేశయా

Friday, June 25, 2021

శివోహం

త్రిశూలం 
త్రివర్ణం
త్రిముఖం 
త్రిపురం 
త్రిభావం 
త్రిశుద్ధం
త్రిలోకం 
త్రికారం 
త్రిగుణం 
త్రిశాంతం 
త్రిభాష్పం 
త్రినేత్రం

శివోహం... సర్వం శివమయం

Thursday, June 24, 2021

శివోహం

నీ శక్తి అంత ఇంత అనలేను 
సర్వ మంత నీదే తల్లి...
నీ దయకు అడ్డు లేదు...
నిన్నే మోము కొలుచు చున్నాము అమ్మగా...
శివుని వలే మాకు రక్ష నీవు...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

ఓం గం గణపతియే నమః

సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ...
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ...
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ...
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ...
నీవే శరణు గణేశ నీవే శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...