Thursday, July 1, 2021

శివోహం

ఎన్ని మహాయుగాలైనాయో...
ఎన్ని మాయల ఊయలలూగానో...
ఎన్ని కోరికల గుర్రాలెక్కానో...
ఎన్ని పాపపు కోటలు మూట కట్టానో...
ఎన్ని జన్మలలో ఏ మూలనో చేసిన పుణ్యం
నిన్ను ఎన్నుకున్నాను...
ఎంచకు నా తప్పలను అలసిపోయిన నా మనసుకు వయసుకు తోడుగా నిలబడవా...
మహాదేవా శంభో శరణు...

Wednesday, June 30, 2021

శివోహం

సమస్తలోక మానవులు అది పూజగా కొలిచే శ్రీవిఘేశ్వరా...

గణగణ నాదంతో మా గణాంకాన్ని సరిచేసి సర్వ సిద్ధులను అనుగ్రహించు వరసిద్ధి ప్రదాయకాయ...

ఓం గం గణపతియే నమః

శివోహం

నిన్ను తప్ప అన్యుని తలవను పరమేశ్వరా
నీవే శరణు...
మహాదేవా శంభో శరణు

Tuesday, June 29, 2021

శివోహం

శివ...
నీ భక్తజన కోటి లో నేను ఒక్కడిని...
నన్ను ఓ కంట కనిపెట్టి ఉంచు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఎగసి పడే భాధనంత...
కంటనీరుగా కారకుండా.  
గుపెడంత గుండెలోన....
భద్రపరిచి దాచి ఉంచ...
నిన్ను అభిషేకించడానికి....
దాగలేనని అది అలల కడలిల...
ఉరకలేస్తూ పరుగుతీస్తూ...
మది భంధనాలను తెంచుకుంటు...
వాన చినుకుల కన్నుల నుండి కారుతుంది...
నీకెలా అభిషేకించను....
మహాదేవా శంభో శరణు...

శివోహం

నా శరీరంలో ప్రతి కణంలో జరిగే క్రియలు మీరే నడుపుతున్నారు శివ...

మీ అడుగులు నా అణువణువున
నడిపిస్తున్నాయి...

మీరండగా ఉండగా నా గుండె బలం కొండంత కాకుండా ఉండునా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Monday, June 28, 2021

శివోహం

అందాలను చూపెట్టి మనసు వశం తప్పెలా చేసి....
పాపాల బందీలలో పడగొట్టి జీవితమే పరవశమయ్యేలా చేసి....
లోకమనే మైకంలో నను నెట్టి.....
అన్నీ నీవని ఆశపెడతావు....
ఆటబొమ్మలు చేసి అడుకొంటావు.....
ఏమిటి ఈ చిత్రము శంకరా....
ఎంత విచిత్రము నీ లీలలు...
శంకరా!!!నాలో ఆవరించి ఉన్న అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడు...
నా చిత్తం నీకె సమర్పిస్తా  స్వామి.....
మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...