Tuesday, July 13, 2021

శివోహం

అది సుందర సుమధురబ్మణికంఠ నిలయము...
అది పసిడిరత్నకాంతుల పావనమయము...
ధర్మాధర్మ పాపపుణ్య పరిరక్షక నిలయము....

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

దాహం తీర్చే చిరు చినుకు కోసం...
ఎడారి నేలనై ఎదురు చూస్తు...

నీవే ఆశగా...
నీ నామమే ప్రాణంగా బ్రతికేస్తున్నా...

ఏనాటికైనా నన్ను నీ దరికి చేరుస్తావని...

మహాదేవా శంభో శరణు....

Monday, July 12, 2021

శివోహం

శివుడవు నీవే...
హనుమవూ నీవే...
నీతో నీవే...
నాతోనూ నీవే...
పరమేశ్వరా శరణు...
నాకు నీవు తప్ప ఎవరున్నారు...
ఓం నమః శివాయ

శివోహం

నా మనస్సు ఒక కోతిలాంటిది...
దానికి స్థిరం తక్కువ...
కోతి అడవుల్లో తిరిగితే...
నామనస్సనే ఈ కోతి ఎల్లప్పుడు మోహం అనే అడవుల్లో తిరుగుతు ఉంటుంది....
ఇది చాల చంచలమైనది....
తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతో ఉంటుంది...
నా స్వాధీనంలో లేదు....
దాన్ని అదుపులో ఉంచుకోవడం నాకు సాధ్యం కావడం లేదు...
నేను అశక్తుణ్ణి నువ్వు నా మనస్సు అనే కోతిని భక్తి అనే పగ్గాలతో గట్టిగా బంధించి నీ అధీనంలో ఉంచుకో...
నీకు భుక్తి నాకు ముక్తి రెండూ లభిస్తాయి.
మహాదేవా శంభో శరణు...

ఐవోహం

సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది...
దైవం (శివుడు) ఓంకార ప్రేమ స్వరూపం...
ఆయన రూప రహితుడు...
నాశన రహితుడు, నిర్గుణుడు...
ఆయనతో ఐక్యం కావడానికి యత్నించు...
సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

శంభో...
జ్ఞాన నిడివి నీవు...
నిన్ను తెలుసుకొనగా నాకింత జ్ఞానం ఇయలేవా...

మహాదేవా శంభో శరణు...

Sunday, July 11, 2021

శివోహం

జ్ఞానమేది
అజ్ఞాన మేది అనేది తెలుసు కోవటము లోనే సగము జీవితము వ్యర్ధమై పోతుంది శివ...
సుఖాలకోసం, కోరికలు తీర్చు కోవటం కోసం సగములో సగము  జీవితము నిద్రలో మినిగి పోతుంది...
మనసారా నిన్ను కొలిచేదెన్నడు...
తనివితీరా నీ నామం జపించేది ఎన్నడూ...

మహాదేవా శంభో శరణు...

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...