Friday, July 16, 2021

శివోహం

ఈ పయనం ఎందాక మిత్రమా...
తనువు మనసు ఆత్మ ఏకం అయ్యి దివి నుండి భువి కి నిచ్చెన దొరికేంత వరకే కదా...
అందుకే నీవు ఎవరో తెలుసు కో...
వచ్చిన పని చూసుకో...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఏకాదశి ఉపవాసం ఉండలేదు...
ద్వాదశి భోజనం చేయలేదు...
ఏనాడు నీ పూజ, జపం, ధ్యానం, పురాణ పఠనం చేయలేదు గోవిందా...
నీవే శరణు...
నీదే రక్ష...

శివోహం

మూలశక్తివి నీవమ్మా…...
ఇచ్చాశక్తివి నీవమ్మా…....
జ్ఞానశక్తికి మూలం నీవమ్మ....
బ్రహ్మ… విష్ణు… శివులనడుపు పరాశక్తివి నీవమ్మా..
ఆది మాతృమూర్తివి 
సర్వలోకాలు పాలించు ఆది శక్తివి
ప్రకృతిమాతవు
అడిగినవారికి లేదనుకుండా భిక్ష ప్రసాదించు మాతవు
అన్నపూర్ణవు
సర్వుల బాధలనుతీర్చి కోర్కెలను నెరవేర్చు మాతవు
దుష్టులను శిక్షించి
సజ్జనులను కాపాడు మాత
పాడి పంటలను కాపాడి
సమృద్ధిగ నీయవే మా అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ

అమ్మ దుర్గమ్మ శరణు...

శివోహం

నీ భక్తితో కలిగింది జ్ఞానం...
ఆ జ్ఞానం నీ సేవలో ధన్యం...
మహాదేవా శంభో శరణు

శివోహం

బంధాలు...
బంధుత్వాలు...
నా అవసరాలు...
అన్ని సర్దుబాటు అయ్యాకనే నీ గురించి అలోచిస్తున్నాను...
నన్ను మన్నించి నీ దరికి చేర్చుకో పరమేశ్వరా

మహాదేవా శంభో శరణు...

Wednesday, July 14, 2021

శివోహం

నేను నేను కాదు...
నేను, నాది భ్రమే.
జననీజనకులు జన్మనిస్తేఈలోకంలో అడుగు పెట్టాను... గురువు నేర్పితే విద్య...
ఉద్యోగం ఎవరి పుణ్యమో...
భార్యాపిల్లలువగైరా., పంచేంద్రియాలు, పంచభూతాల సాయంతో జీవనయానం....
మరణానంతరం నలుగురు చేత దహనకార్యం....
మరినేనంటూ నాదంటూ ఎక్కడ శివా....

మహాదేవా శంభో శరణు...

Tuesday, July 13, 2021

శివోహం

శ్రీపరమేశ్వరా నిన్నే నమ్ము తున్నాను...
గతిగా శ్రీ పార్వతి దేవి నాకు మాతృ మూర్తిగా...
నీ సేవలతో పరవశం చెందు తున్నాను...
నీ కృపయే నాకు శిరోధార్యం అయి ఉన్నది...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.