Wednesday, July 28, 2021

శివోహం

శివోహం

సంపద లెరుగను సొంపైన 
నీ నామంబుతప్ప....

ధనమును కాంచను ఘనమైన 
నీ రూపంబు తప్ప....

భవనములు ఎరుగను భవ్యమైన 
నీ చరణారవిందములు తప్ప....

కనకపురాసులు ఎరుగను కోమలమైన 
నీ కృపా కటాక్ష వీక్షణములు తప్ప....

మహాదేవా శంభో శరణు.....

శివోహం

విధేయునిగా వినమ్రతతో ఉండి భక్తితో 
పూజిస్తే ఆ దేవదేవుడే దిగిరాడా మన చెంతకు...

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, July 27, 2021

శివోహం

అంతటా తానై...
అన్నీ తానై...
అందరిలో తానై...
ప్రాణుల మనుగడకు...
సృష్టి  స్తితి లయాలకు...
కాలచక్ర భ్రమనానికి కారణ భూతమై...
సూర్య చంద్రుల రూపంలో...
కళ్ళ ముందు నిత్యం వెలుగొందుతూ దర్శన మిస్తు...
నిత్యం మమ్మల్ని నిత్యం కాపాడే వాడు మహాదేవుడు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నేను వెళ్లే ప్రతి చోట...
నా కన్నా ముందు నా మహాదేవుడు తప్పక ఉంటాడు...
అందుకే శివోహం అన్న ప్రతి సారి అహం పోయి
శివుడే అన్నింటా పిలిచినట్టు ఉంటుంది....

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, July 26, 2021

శివోహం

భస్మాన్ని ధరించిన ఆయన దగ్గర ఏముందీ అని అడుగుతారు కొందరు...
కానీ భస్మాన్ని మించిన పవిత్రమైనది ఈ సృష్టిలో వేరే ఏమీ లేదు...
జన్మాంతర పాపాలను దహించి వేసేదే భస్మం...
కాబట్టే, భస్మానికి 'విభూతి' అని పేరు...
విభూతి అంటేనే ఐశ్వర్యమనీ అర్థం...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నాకు గతాలు లేవు...
కాలం వాటిని కబలించింది...
రేపు అన్నది లేకపోవచ్చు...
కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది...

ఓం నమః శివాయ...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...