Sunday, August 1, 2021

శివోహం

శంభో నిన్ను నమ్మినట్లు ఎవరినీ నమ్మను...
నాకు నీ కంటే అన్నలు కానీ, అన్నదమ్ములు కానీ , తల్లితండ్రులు కానీ, గురువులుకానీ , కష్టాలలో ఆదుకునే ఆప్తులు గాన ఇంకెవ్వరూ లేరు...
నన్ను ఈ సంసార విష సముద్రాన్ని దాటించి , చిదానంద స్వరూపమైన సౌఖ్యసముద్రములో ఎప్పుడు తేలియాడిస్తావో కదా !
అంతా నీ దయ తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!చూస్తున్నాను చూస్తున్నాను
నీ దర్శనానికై ఎదురు చూస్తున్నాను
ఎదను చూడగ నిన్ను ఎదురీదుతున్నాను
మహేశా . . . . . శరణు .

శివోహం

Saturday, July 31, 2021

శివోహం

శంభో...
నిను వీడి  ఉండలేను...
నను నేను వేరుగా  చూడలేను...
నువ్వే నేను నేనె నువ్వు...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!కర్మ బంధం జన్మలు కడతేరనివ్వదు
జ్ఞాన బంధం జన్మను దరి చేరనివ్వదు
ఆ జ్ఞానమీయి ,జన్మ నెడబాటు చేయి
మహేశా . . . . . శరణు .

శివోహం

పుట్టుకలోంచి.....
బతుకులోకి....

బతుకులోంచి 
చింతనలోకి
 
చింతనలోనుంచి చితిలోకి చేరాక చిత్తగించు
జీవిత భ్రమణాన్ని అక్కడే ముగించు....

మహాదేవా శంభో శరణు

Friday, July 30, 2021

శివోహం

రెండు ఊపిరుల నడుమ క్షణకాలం ఆగిన సమయంలో నిశ్శబ్దానివి నీవు...
ప్రాణాయామం తర్వాత మౌనంలో శబ్దానివి నీవే కదా పరమేశ్వరా...
అయితే అనుక్షణం ఆ భావనలో మమ్మల్ని నిలపవేమి తండ్రి...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...