Tuesday, August 3, 2021

శివోహం

ఎక్కడో దూరాన కూర్చున్నావు...
కుటుంబ సభ్యులందరున్నా ఒంటరిగా మాకొరకు తపస్సు చేస్తూ...
నిన్నన్వేషించాలని నేనూ తపస్సు చేద్దామని కూర్చుంటే బంధాలు బంధువులు బాంధవ్యాలు నిన్ను చేరనీయక అడ్డుకుంటున్నాయి...
నిను కనుగొనే దారిచూపవా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!వెలుగు వేల్పుకు వెలుగిచ్చు వాడా
జ్ఞాన మూలమై జగతిని భాసించు వాడా
నాలోన  జ్ఞానమై భాసించవోయి
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
నీవు నా చుట్టూ ఆరా గా ఉన్నావని తెలుసు...
ఆ నీవే నను నడుపుతున్నావని తెలుసు...
కానీ నిన్ను చూసేదెలా పరమేశ్వరా...
నిను చూసే జ్ఞాన నేత్రాం ప్రసాదించు శంభో...

మహాదేవా శంభో శరణు...

Monday, August 2, 2021

శివోహం

పితృత్వమే తన్మయతత్వమై....
మాతృత్వమే అమృతత్వమై ....
సదా మీ సేవలోనే జీవిస్తున్న....
మహాదేవా శంభో శరణు..!!

శివోహం

జన్మజన్మల నుంచి ఇదే స్థితి
ఏ జన్మలో మారేను నా గతి
నీ తోడు లేకపోతే నా బతుకు
పోరాటంలో నిస్సహాయముగా
రోదనలు ఆక్రందనలు మినహా
ఆదుకునే నాధుడు లేడు అందుకే
నీ నీడను ఓ రాట వేసుకుని
నిలిచిపోతాను పరమేశ్వరా
ఆదుకో ఆది దేవా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!కష్టాలు కాస్త తెలియనీ
నిత్యం నిను తలచుకుంటా
కంట నీరు జారితే నీకు అభిషేకం చేసుకుంటా
మహేశా..... శరణు

Sunday, August 1, 2021

శివోహం

సంపద...
స్నేహ సంపద...
రెండింటిలో దేన్ని ఎంచుకుంటారని అడిగితె...
స్నేహమే కావాలంటాను...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...