Thursday, August 5, 2021

శివోహం

శివా! నీవు నిత్యం మాతోనే ఉంటావు
అని అనడంలో అనుమానము లేదు
చెప్పడానికి ఉపమానమూ లేదు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!వెలుగు వేల్పుకు వెలుగిచ్చు వాడా
జ్ఞాన మూలమై జగతిని భాసించు వాడా
నాలోన  జ్ఞానమై భాసించవోయి
మహేశా . . . . . శరణు .

శివోహం

ఆది పూజ్యుడవు....
ఎలుక వాహనుడవు...
కుక్షి నిండ నీకు కుడుము లిడుదు....
కరిముఖ గణపయ్య కాపాడు కరుణతో...
అర్థితోడ కొలిచి విన్నవించు కొందు....
విఘ్న రాజ కరుణతో కాపాడు.....

Wednesday, August 4, 2021

శివోహం

సృష్టి అంతా వ్యాపించి ఉన్నావు పరమేశ్వరా...
ఎటు చూసినా నీవే కదా...
మా ఈ పయనం పురోగమనమే...
నీవు కనిపించే వరకు మా పయనం ఆగదు ఈశ్వరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

సత్యం శివం సుందరం అంటే
నీవే తండ్రి నీవే...
వ్యథ గొంతున దాచే శివుడు నీవే..
నిందల మబ్బులు చీల్చి సూర్యుడవు నీవే...
యధ దీపంలా వెలిగి మా కలతలు తీర్చే దేవదేవుడు నీవే...
మహాదేవా శంభో శరణు...

Tuesday, August 3, 2021

శివోహం

ఎక్కడో దూరాన కూర్చున్నావు...
కుటుంబ సభ్యులందరున్నా ఒంటరిగా మాకొరకు తపస్సు చేస్తూ...
నిన్నన్వేషించాలని నేనూ తపస్సు చేద్దామని కూర్చుంటే బంధాలు బంధువులు బాంధవ్యాలు నిన్ను చేరనీయక అడ్డుకుంటున్నాయి...
నిను కనుగొనే దారిచూపవా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...