Saturday, August 7, 2021

శివోహం

శివా!తలలోని తలపులు తొలగిపోనీ
ఆలోన నీ తలపు నిండిపోనీ
ఆమూలం అహమంతా ఆవిరైపోనీ
మహేశా . . . . . శరణం .

Friday, August 6, 2021

శివోహం

దేవతలు
ధర్మపరులు
భక్తులు
సంచరించుకొండ...
వేదమంత్రాలుతో నిరంతరం హరినామస్మరణ చేయు కొండ ఏడుకొండల కొండ...
ఆ కొండపై నన్ను బండరాయి గా మార్చి నీ అధీనం లో ఉంచుకో నారాయణ...

ఓం నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
శ్రీహరి శరణు...

శివోహం

నీకివ్వటానికి మాదగ్గర మాదంటూ ఏది లేదు తండ్రి...
నీది నీకు అర్పణం అనటం తప్ప...
చాలు తండ్రి చాలు...
ఈ ఆట చాలు...
కన్నీరు రూధిరం అయి పారుతుంది తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Thursday, August 5, 2021

శివోహం

శంభో
అభిషేకం కోసం నేను ప్రత్యేకంగా సముద్రజలాన్ని కోరుకోకు తండ్రి...

అహం బ్రహ్మాస్మి అన్న భావనలో నా మనస్సనే సముద్రం నుండి పొంగి, కళ్ళ తీరాలు దాటి జాలువారుతు నీ కలశంలోనే పడుతున్నవి ఆ కన్నీటి చుక్కలతో అభిషేకించుకో

 మహాదేవా శంభో శరణు

శివోహం

నిన్న ను మరిపిస్తావు...
నేటి నుంచి మురిపిస్తావు...
రేపటి రోజును గుర్తు చేస్తావు...
మూడు నామాల వాడవు...
నిన్న నేడు రేపుల నాధుడవు...
లోకాల నేలుతూ నన్ను కాచేవాడవు నీవే
పరమేశ్వరా...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! "శివమయం జగత్ " అని అంటున్నా
ఆనందానుభూతి నాకు అందకుంది
అందనీవయ్యా ,నన్ను పొందనీవయ్యా.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నీవు నిత్యం మాతోనే ఉంటావు
అని అనడంలో అనుమానము లేదు
చెప్పడానికి ఉపమానమూ లేదు
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.