Monday, August 9, 2021

శివోహం

శంభో...
త్రికాలములను నడిపెంచేది నీవే...
నేను తలచేది నిన్నే...

మహాదేవా శంభో శరణు...

Sunday, August 8, 2021

శివోహం

చల్లని హిమగిరి పైన కూర్చుని ఉన్నావు...
చెల్లని మా బ్రతుకులను చూస్తూ ఉన్నావు...
మాపై ఇంత నిర్దయ ఏలనయ్యా...
ఇకనైనా మము కావగ రావయ్యా...
మా హృదయాలకు ఇంత వేదనెందుకయ్యా...
ఈ లోకంలో నీకన్నా మాకెవరయ్యా...
మనసా వాచా కర్మణా నిను నమ్మితి కదయ్యా....
కాపాడా రావయ్యా పరమేశ్వరా..

మహాదేవా శంభో శరణు...

శివోహం

జీవు డెవరు...
దేవుడు ఎవరు...
వారి నైజము
తెలిసినపుడే తొలగు బంధము...
ఊగులాడే వాడే జీవుడు...
ఊరకుంటే దేవుడతను...
తనను మరచిన జీవుడగును...
తనను ఎరిగిన దేవుడగును...
ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, August 7, 2021

శివోహం

శంభో...
నేను తినే ఈ నాలుగు మెతుకులు నీ కృపా కటాక్ష వీక్షణ దయా భిక్ష ఆశీర్వాదాలతోనే కదా..

నేను భుజించే ముందు కొన్ని మెతుకులు ముందుగా సమర్పించడం నీకు నైవేద్యమే కదా తండ్రీ ...

మహాదేవా శంభో శరణు..

రామభక్త హనుమా

స్వామీ రామబక్త..
నిజమైన ఆచార్యుడవు అంటే నీవే తండ్రీ...
నాకు జ్ఞాన నేత్రం తెరిపించావు...
నీ కృపకు నోచుకున్న నేను నిజంగా అదృష్టవంతుడను...
హే గురుదేవా
వాయు పుత్రా
అంజనీ తనయా
హే రామ దూతా
వీర హనుమా
అభయ ప్రదాతా శరణు...

శివోహం

కట్టె కొనల కడ...
కడ చూపులేల శివా...
తనువు కాలిపోక ముందే...
నా కనులు తెరిపించు...
నిన్ను చూపించు...

మహాదేవా శంభో శరణు

శివోహం

శివా!ఆర్చన నిను చేర నిచ్చెన కావాలి.
ఆ నిచ్చెన ఊతగా నీ ఎఱుక కలగాలి
ఆ ఎఱుకలో నేను ఏకమవ్వాలి
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.