Tuesday, August 10, 2021

శివోహం

ఆశలు ఆశయాలు రెండు వైపులా గోడలు కాగా కోరికల మెట్లపై సాగిపోయే జీవితానికి లక్ష్యం ఏముంటుంది పరమేశ్వరా...
నా జీవన విధానానికి స్పష్టీకరణలు ఏమీ లేవు...
చేయి కాలిన వేళ గుర్తు వస్తున్నావు...
అన్నీ వదిలి నిన్ను చేరే కోరికే నా చివరి లక్ష్యం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తావని
ఎదను చూస్తున్నాను ఎలా ఉంటావని
నా చూపు ఫలమవనీ,నీ చూపు వరమవనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!కనువిప్పు కలుగు రోజు చేరువవనీ
కనుతెరిచే రోజు కాస్త దూరమవనీ
ఈ రోజులు లెక్కలు అన్నీ మారిపోనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తావని
ఎదను చూస్తున్నాను ఎలా ఉంటావని
నా చూపు ఫలమవనీ,నీ చూపు వరమవనీ
మహేశా . . . . . శరణు .

శివోహం


ఇద్దరు మనసులు దగ్గర అవ్వడం అనేది ఆనందాన్ని పంచుకోవడానికి కావాలె గాని...
ఒకరినుండి మరొకరు ఆనందాన్ని పిండుకోవడానికి కాకూడదు...
ఓం నమః శివాయ.
Sadhguru

శివోహం

తండ్రి...
నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు...
ఈ జన్మకైనా మరే జన్మకైనా నీవే నా తండ్రివై తోడు నీడగా నడిపించి నీచెంతనే నిలిచేలా అనుగ్రహించే
బాధ్యత భారము నీదే శివయ్యా...

మహాదేవా శంభో శరణు...

Monday, August 9, 2021

శివోహం

శంభో...
ఒకానొక రోజు శ్రావణ ఆదివారం...
నన్ను మజలీలు చేయమని భూమిపైకి పంపావు...
కష్ట, సుఖాలు అనుభవిస్తు పోరాడి ఓడిపోతు నీ అండదండలు కోరుకుంటున్నాను...
పరుగున రావా నన్ను ఆదుకోవా...
జన్మదిన నా నన్ను ఆశీర్వదించాగా రావా శివా...

మహాదేవా శంభో శరణు....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...