Friday, August 13, 2021

శివోహం

భక్తుడు భగవంతుని దిశగా ఒక్క అడుగు వేసినప్పుడు...

భగవంతుడు అతని దిశగా వంద అడుగులు వేసి పలుకరిస్తాడు...

భక్తుడి పట్ల భగవంతుని ప్రేమ అనేది భగవంతుని పట్ల మానవుని ప్రేమ కంటే వందరెట్లు అధికం...

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, August 12, 2021

శివోహం

ప్రేమ...
భగవంతుడిని మన హృదయంలో బంధించడానికి తోడ్పడే అత్యంత సున్నితమైన, మధురమైన ఆయుధం...
ధ్యానం, మంత్రం, తంత్రం...
ఏమీ  తెలియక పోయినా పరవాలేదు...
నిష్కల్మషంగా ప్రేమించే హృదయం నీ దగ్గర ఉందా? భగవంతుడు ఈ రోజునే...
ఇప్పుడే...
ఈ క్షణమే నీ వశమవుతాడు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!ఉపమానానికి అందవు
ఉదాహరణలకు చెందవు
ఉన్న ఒక్క నీవు ఒక్కడిగా ఉండవు
మహేశా . . . . .  శరణు

శివోహం

మీ జీవితనుభూతి ఇంద్రియ గ్రాహ్యతకి అతీతంగా వెళ్ళినప్పుడే అది సాపేక్ష కాకుండా పరిపూర్ణం అవుతుంది...

ఓం నమః శివాయ
Sadhguru

శివోహం

శంభో...
నీవు రాసిన గీతలు
పూర్వజన్మ పరంపరల శివతత్త్వాలుగా...
ఆ శివ తత్త్వాలే నా భగవద్గీతలుగా...
ఆ భగవద్గీతలే నా పూర్వపుణ్యఫలగీతలుగా...
నా నుదిటన భస్మరూపగీతలై సదా వెలుగొందు నిండుగా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నీవు సాధు రక్షకుడవు...
నీ నామస్మరణంచేసే వారికి....
దుష్టశక్తులు దరిచేరనియక....
జన్మజన్మల వేదనను తొలగించే ముక్తి ప్రదాతవు....
సకల శ్రేయస్సులను సమకూర్చి...
సమస్త పాపములను నశింపజేయు వాడవు....
హనుమా నీవే దిక్కు నాకు...

జై శ్రీరామ్ జైజై హనుమాన్

Tuesday, August 10, 2021

శివోహం

నాకు నేనే గురువును...
నా ప్రశ్నలన్నింటికి నాకు నేనే సమాధానం చెప్పుకోగలను...

ఓం నమః శివాయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...