Friday, August 13, 2021

శివోహం

శివా!అరిషడ్వర్గ పోరులో ఒంటరినని వెరసేను
బలహీనతల గుర్తెరిగి ఓడిపోతునని బ్రమసేను
నీ అండ తెలిసి నేను నిలువరించగలిగేను.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!ఉపమానానికి అందవు
ఉదాహరణలకు చెందవు
ఉన్న ఒక్క నీవు ఒక్కడిగా ఉండవు
మహేశా . . . . .  శరణు

శివోహం

శంభో...
మనసులో
మాటలలో
సృష్టి లోని
ప్రతి దృష్టిలో నీ పై ధ్యాస కలిగే సానుకూలత కలగచేయి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

భక్తుడు భగవంతుని దిశగా ఒక్క అడుగు వేసినప్పుడు...

భగవంతుడు అతని దిశగా వంద అడుగులు వేసి పలుకరిస్తాడు...

భక్తుడి పట్ల భగవంతుని ప్రేమ అనేది భగవంతుని పట్ల మానవుని ప్రేమ కంటే వందరెట్లు అధికం...

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, August 12, 2021

శివోహం

ప్రేమ...
భగవంతుడిని మన హృదయంలో బంధించడానికి తోడ్పడే అత్యంత సున్నితమైన, మధురమైన ఆయుధం...
ధ్యానం, మంత్రం, తంత్రం...
ఏమీ  తెలియక పోయినా పరవాలేదు...
నిష్కల్మషంగా ప్రేమించే హృదయం నీ దగ్గర ఉందా? భగవంతుడు ఈ రోజునే...
ఇప్పుడే...
ఈ క్షణమే నీ వశమవుతాడు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!ఉపమానానికి అందవు
ఉదాహరణలకు చెందవు
ఉన్న ఒక్క నీవు ఒక్కడిగా ఉండవు
మహేశా . . . . .  శరణు

శివోహం

మీ జీవితనుభూతి ఇంద్రియ గ్రాహ్యతకి అతీతంగా వెళ్ళినప్పుడే అది సాపేక్ష కాకుండా పరిపూర్ణం అవుతుంది...

ఓం నమః శివాయ
Sadhguru

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...