Monday, August 16, 2021

శివోహం

దిన దినమూ ద్విగుణీకృతమయ్యే
దేహం మీదా వ్యామోహం నాకేలనయ్యా శివ...

నీ అఖండ వైరాగ్యాన్ని కాసింత విభూదిగా 
నా నుదుటిన రాయవయ్యా తండ్రీ...

మహాదేవా శంభో శరణు...

Sunday, August 15, 2021

శివోహం

విడువ వలసినది నా అన్న భావము...
పట్టవలసినది శివ పాదము...
పొందవలసింది  శివ దామము ఎరుక కలిగితే దక్కును ఆ భాగ్యము...
ఎరుక లేకున్న వచ్చును మరో జన్మము...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!భాషించకుండా భాసించు చున్నావు
వీక్షించకుండా వివరించు చున్నావు
కాంక్షించకుండా కరుణించు చున్నావు
మహేశా . . . . . శరణు

శివోహం

శంభో...
నాలో ఉన్న అహమనే మృగాన్ని వధించి...
నీ నామమును నాకు సోహం గా ప్రసాదించు తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Saturday, August 14, 2021

శివోహం

శివా!నీ ప్రతిరూపాన్ని ప్రతిష్టించి
పరవసాన పూజలు చేస్తున్నా
అన్ని రూపాలు నీవిగా తెలియనీయి
మహేశా . . . . . శరణు .

శివోహం

ఊపిరి ఉన్నంతవరకే కాదు...
ఊపిరి పోయాక కూడా నా తోడు నీవే పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Friday, August 13, 2021

శివోహం

సీతా నాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
లక్ష్మీ పతయే గోవిందా
లక్ష్మణాగ్రజా గోవిందా
దశరధ నందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాండవప్రియనే గోవిందా
బలరామానుజ గోవిందా
భాగవతప్రియ గోవిందా
గోకులనందన గోవిందా
గోవర్ధనోధ్ధార గోవిందా
శేషశాయినే గోవిందా
శేషాద్రినిలయా గోవిందా

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...