Tuesday, August 24, 2021

శివోహం

శివా!వేడి చూపున  కాల్చుతావో
వాడి చూపున కరుణిస్తావో...నీ ఇష్టం
ఏమైనా  నీవంటేనే నాకిష్టం
మహేశా . . . . . శరణు .

శివోహం

నా గమ్యం నీవు...
నాకున్న ఏకైక లక్ష్యం నిన్ను చేరుటయే...
నా పయనం నిన్నుచేరే వరకు నీ మీద ద్యాస తప్ప నాకు లేదు నా ప్రాణం మీద ఆశ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

భాహ్య విషయాలతో భగవంతుని అనుసందానం చేయకూడదు.వాటి అవసరాల కోసం భగవంతుని ప్రార్థించకూడదు. చెడుకు దూరంగా, మంచిలో బ్రతికేందుకు ప్రార్ధించాలి...

ఈ దేహమూ, ప్రాణమూ భగవంతునిదే కనుక ఈ జీవితాన్ని ఆయనకు ఇష్టం వచ్చిన రీతిగా మలచుకొమ్మని ప్రార్ధించాలి. మనకు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉంటూ పదిమంది మంచికొేసం ప్రార్ధించాలి.నిత్యమూ ఆయన సృహలొనే ఉండేలా చేయమని ప్రార్ధించాలి...

ప్రార్ధన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చకున్నా అది మన మనస్సును ప్రభావితం చేయగలదు. కనుక జీవితంలొే ప్రార్ధన అనేది ఒక బాగమైపోయేలా చూసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, August 23, 2021

శివోహం

అలసిపోతున్నాను శివా విశ్రాంతి ఈయవా ఈశ్వరా
ఒకడిని పంపి జతకలిపి ముగ్గురను చేసి బంధాల బరువులు పెంచి బాధ్యతల లోతులలో పడేసి
ఈదమంటే ఎలా శివా...

నిన్ను స్మరించే సమయమే ఈయవా...
నిత్యం నీ నామాలాపన చేసేది ఎలా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
అఖిల లోకములకు మూలం నీవే... 
సకల శాస్త్రముల సారమూ నీవే... 
అష్ట ఐశ్వర్యములకు అధిష్టానం నీవే... 
ఓ శంకరా ! దేవతా సార్వభౌమా... 
సర్వ శక్తి సంపన్నుడవు నీవు... 
నను కరుణించుట భారమా తండ్రీ... 
నీ దయకు నేను తగని వాడినా.... 

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఓ కన్నీటి బొట్టు జారినాక కానీ తెలియలేదు మహాదుఃఖం నన్నావహించిందని...
ఆ దుఃఖాన్ని నీ నామం అనే చిరునవ్వుతో బందించా...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.

శివోహం

శివా!నాకేదో తెలుసుకోవాలని ఉంది
నీతో ఏదో చెప్పాలని ఉంది
సతమతమవుతున్నా, శరణమంటున్నా
మహేశా .  . . . . శరణు .

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.