Wednesday, September 1, 2021

శివోహం

శంభో ... 
బాల్యము ఆటలమయము...
యవ్వనము ప్రలోభాలమయము...
నిన్ను తలవని మనస్సును మన్నించి...
నిన్ను తెలియని బుద్ధిని కరుణించు...
నీవే దిక్కని నీవే నిజమని శరణు వేడే నాలో భక్తిభావము రగిలేలా కలుగజేయవయ్య శివ...
నిన్ను తప్ప అన్యము ఎరగను...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!పాదాక్రాంతం అవుతున్నా పదిమందిలో
ఏకాంతం కోరుతున్నా నీ సన్నిధిలో
ఆసాంతం ప్రశాంతం నీ చెంతనే
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
నీవు కన్ను తెరచినానీ కనుసన్నలలోనే కదా
నేనున్నది...
నీ మౌనం నాకు దీవెనగా భావించి నా జీవన యానం
సాగిస్తున్నాను...
నా మేను వీడి నేను నీ కడకు చేరాలని....
నా యజమానివి నీవే కదా శివ ఆనతినీయాలి మరి...
బాడుగకు మరో దేహం చూసి పంపేది నీవే కదా మరి నా విషయంలో నీకెందుకు శ్రమ...
నీ గణంలో ఒకడిని చేసుకొని నీ వాడిగా మలచుకోవచ్చుగా పరమేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
యుగ యుగాల నుండి ప్రతీ దినం , ప్రతీ క్షణం నీ అనంత హస్తాలతో జగతిని సంరక్షిస్తూనే ఉన్నావు...
రాత్రీ పగలు మారుస్తూ సమస్త ప్రాణికోటి జీవనానికి మూల కారకుడవుతున్నావు...
పుట్టడం, బ్రతకడం,చావడం అంతా నీ అధీనంలొనే...
పరమేశ్వరా! నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవానికి...
నీ దయ లేకుండా మా మనుగడే లేదు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నా మౌనంలో శతకోటి సందేహాలు
నీ మౌనంలో అనంతకోటి సమాధానాలు
మౌనమే మోదమని మౌనంలో తెలియనీ
మహేశా . . . . . శరణు .

Monday, August 30, 2021

శివోహం

శంభో...
నా ఈ శరీరం అనే ఇంటికి యజమాని నీవు...
నాలో ఉంటూ నా మనుగడకు కారణం నీవు...
నీవే నాకు అత్యంత ఆప్తుడివి ఆత్మీయుడివి ఆత్మబంధువు కూడా...
జననం నుండి మరణం వరకూ నన్ను ఎటువంటి సుఖ దుఖ పరిస్తితి లో విడవకుండా నా దేహాన్ని అంటి పెట్టుకొని ఉన్న నా మనసే నీవు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శరీరం కంటే ఇంద్రియాలు...
ఇంద్రియాల కంటే మనస్సు...
మనస్సు కంటే బుద్ది...
బుద్ది కంటే ఆత్మ గొప్పది అన్న పరమ సత్యాన్ని తెలియజేసిన పరమాత్మ నీకు వందనాలు....

ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మనే నమః

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...