Saturday, September 4, 2021

శివోహం

‌శంభో...

‌నిన్ను మరవని నీ దివ్యమంగళ స్వరూపాన్ని క్షణమైనా విడవని భావ సంపదను సదా నాకు అనుగ్రహించు తండ్రి...
‌నా గురించి నీకు మాత్రమే తెలుసు నీ హృదయం నాకు తెలుసు స్వామీ...
‌నేను నీ ధ్యాసలో నిద్రపోతున్నపుడు ఈ  శరీరం నీదిగా ఉంటుంది దాని రక్షణ భారం నీదే...
‌మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!గుండెలో వెలుగుతున్నావు
గుడిలో మెరుస్తున్నావు 
గుడి,గుండెల అనుబంధాన్ని చాటుతున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
నా బాధలో నీడవి నీవు
నా సంతోషంలో తోడువు నీవు
నా కష్టంలో భాగం నీవు
నా ఇష్టంలో భావం నీవు
నా మనసులో రూపం నీవు
నాలో మౌనం నీవు
నాలో శ్వాసే నీవు
నా హృదిలో వెలుగే నీవు
నా పయనం నీ పదసన్నిథికే
నన్ను దరిజేర్చుకొనేదీ నీవే
నా ఆరాధ్యదైవం నీవే

మహాదేవా శమనో శరణు.

Friday, September 3, 2021

శివోహం

శంభో...
సంసారం అనే ఊబి లో చిక్కుకు పోయాను...
ఏం చేయము ఇందులోనే ఉన్న సుఖ దుఃఖాలే స్వర్గం అనీ భావిస్తూ...
బావిలో కప్పల వలె అజ్ఞానం అనే చీకటి నూతిలో బ్రతుకు ఈడుస్తు బ్రతుకుతూ ఉన్నాను శంకరా...
జననం నుండి మరణం వరకూ ఇలా ఎంతకాలం ఈ వలయం లో భ్రమిస్తూ ఉండాలో తెలియదు...
నీ మూడో కన్ను తెరచి కాముడుని చిత్తు చేసి నీ దరికి చేర్చుకో...
మహాదేవా శంభో శరణు.

శివోహం

నీ జగన్నాటకం లో ఉంటూ నటించే పని బాగా ఒంట బట్టింది...
హనుమంతుని ముందు కుప్పి గంతులు మావి...
నీ పూజ లోనే కాదు రోజంతా, బ్రతుకంతా నటనే... ఎన్నో అబద్ధాలు కోపాలు తాపాలు అబ్బో ఎన్నో డ్రామాలు మోసాలు...
నిన్ను కూడా మోసం చేసే మాయగాళ్ళం అంటే నమ్ము...
శంకరా నా చేతలు పట్టించుకోకు నా గోడు పట్టించుకో
నీ ఇంటికి రప్పించుకో...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నా జ్ఞాపక శక్తిని జ్ఞానంతోను
నా మరపును అజ్ఞానంతోను
ముడిపెట్టి సమతుల్యం చేయి
మహేశా . . . . . శరణు

Thursday, September 2, 2021

శివోహం

భగవత్ సన్నిధికి చేరుకొనుటకు నామస్మరణ ఎంతటి ముఖ్యమో సేవలు కూడా అంతే ముఖ్యం. నామస్మరణ , సేవలు ఈ రెండూ రైలు పట్టాల వంటివి. కేవలం ఒక పట్టా మీదుగా పోతే రైలు తన గమ్యస్థానం చేరుతుందా?  రెండు పట్టాలు మీదుగా వెలితేనే గమ్యస్థానం చేరుకొగలదు. అదే విధముగా మనం భగవత్సన్నిధికి చేరుకోవాలంటే నామ స్మరణతో పాటు  సేవలు కూడా చేస్తుండాలి. అపుడే ప్రయాణం సులభమౌతుంది. శీఘ్రముగా భగవంతుని సన్నిధికి చేరుకొనుటకు అవకాశం ఉంటుంది.

ఓం శివోహం... సర్వం శివమయం.

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...