Wednesday, September 8, 2021

శివోహం

శివా!వెలుగు వేల్పుకు వెలుగిచ్చు వాడా
జ్ఞాన మూలమై జగతిని భాసించు వాడా
నాలోన  జ్ఞానాన్ని ప్రభవించనీయి
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
సుఖ:దుఖాలు కల్పించేది నీవే...
ప్రకృతిని జీవరాసిని అనుక్షణం రక్షించేది కూడా నీవే...
నాకు సుఖం వచ్చినప్పుడు ఆనందం పెరుగుతుంది అది నీవే కల్పించవని గ్రహించలేక...
ద:ఖం వచ్చినప్పుడు కుమిలిపొతూ కష్టాలు తొలగించమని నిన్ను ప్రార్థిస్తున్న...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
నోరు నీ నామ స్మరణ చేస్తుంది...
బుద్ది బురదలో నాట్య మాడుతుంది...
నా మనసు అనే సామ్రాజ్యం కు అధిపతి నీవు...
కోరికల గుర్రాలకు కళ్ళం వేసి నీ సన్నిధిలో కట్టిపడేయవా పశుపతి.

మహాదేవా శంభో శరణు.

శివోహం

అమూల్యమైన నిధి అయ్యప్పస్వామి సన్నిధి. ఆ దివ్య స్వరూపమును ఒక్కసారి చూసినా చాలు మిక్కిలి ఆనందము కలుగును...

ఆ స్వామిని స్మరించిన చాలు వచ్చును పుణ్యము... దర్శించిన యెడల మన జన్మ ధన్యము...
కోటి సూర్యుల ప్రకాశము హరిహారతనాయుడు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

Tuesday, September 7, 2021

శివోహం

శంభో...
నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి...
నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా
చేస్తున్నావు..
నీకిది న్యాయమా పరమేశ్వరా...
నా బాధలో నిన్నుగాక వేరొకరిని నిందించగలనా...
అయినా నాది నిందకాదు శంకరా ఆవేదన మాత్రమే...
ఆపద్భాందవుడవని బిరుదు నీది...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!"ఓం"కారమున తెలిసె నీ తొలి శిశువు
"ఓం" కారము వివరించె నీ మలి శిశువు
ఆ "ఓం" కార తేజమై వెలిగేది నీవు
మహేశా.....శరణు.

శివోహం

శంభో...
నీ సన్నిధికై తపిస్తున్నా...
నీ స్మరణతో జీవిస్తున్నా...
నీ లోనే లయమౌవ్వాలని శ్వాసిస్తున్నా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.