Sunday, September 12, 2021

శివోహం

ఈ దేహ ధ్యాస ఉండదు..
ఏ పనిలో చిత్త ముండదు...
ఇది కావాలని ఉండదు..
నిన్ను తప్ప ఏదీ కోరదు...
ఏమీ చేతు రా శివ ఏమి చేతురా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నీకు ఎన్నో వేల పేర్లు ఉన్నాయని వారు వీరు చెప్పంగా వినిఉంటి...

కాని అందులో శివ అనే పేరు మాత్రమే నా గుండెల్లో నిండుగా మెండుగా దండిగా పేరుకొని పోయింది...

నీ గురించిన తత్వ భావ సంపద నేనెరుగను..

సర్వజ్ఞుడువి నీవు నీ వద్ద ఏం దాచగలము చెప్పు...

మహాదేవా శంభో శరణు...

Saturday, September 11, 2021

శివోహం

సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ...
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ...
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ...
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ...
నీవే శరణు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం. 
ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.   జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు ఓంకార దివ్యస్వరూపుడు గణనాథుడు.
సర్వ విఘ్నములను తొలగించే సిద్ది వినాయకుడు.  సత్వర శుభాలను ప్రసాదించే శుభంకరుడు విఘ్నేశ్వరుడు.
ఓం గం గణపతియే నమః.

శివోహం

శంభో...
పరమేశ్వరా...
మహాకాళేశ్వరా...
సూర్యునివలే ప్రకాశవంతంగా... 
చంద్రునివలే ప్రశాంతంగా... 
సంద్రంవలే జ్ఞానవంతంగా... 
పృథ్వివలే సహనంగా నన్ను నిలిపి...
ఈ బ్రతుకు పోరులో నను గెలిపించండి తండ్రీ...

మహాదేవా శంభో శరణు.

Friday, September 10, 2021

శివోహం

విఘ్న నాయకా పూజలందుకో...
సమస్త ప్రజలను ఆదుకో...
సమస్త విజ్ఞానము పంచి ఏలుకో...

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు పెద్దలకు గురువులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

శివోహం

శంభో మహాదేవా
శంభో మహాదేవా
శంభో మహాదేవా
దేవా దయాపూర్ణభావా
నగేంద్రాత్మజా హృన్నివాసా
మహా దివ్య కైలాసవాసా
సదానంద విశ్వేశ్వరా
సర్వలోకేశ్వరా
సర్వయోగేశ్వరా
సర్వభూతేశ్వరా
నందివాహానా
భుజంగేశభూషా
త్రిశూలాయుధా
దేవదేవా శరణు.

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.