Tuesday, September 14, 2021

శివోహం

శంభో...
పుడుతూ...
మరణిస్తూ...
మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది....
ప్రాణేశ్వరా దయతో నన్ను రక్షించు...
మహాదేవా శంభో శరణు.

Monday, September 13, 2021

శివోహం


గజాననాయ
గణాధ్యక్షాయ
విఘ్నరాజాయ
ఉమాపుత్రాయ
వక్రతుండాయ
సూర్పకర్ణాయ
అజ్ఞానుల మైన మేము చేయు తప్పులను క్షమించి
సంసార దు:ఖములను కల్పించే మాయను తొలగించు...

పార్వతి తనయ శివ పుత్ర శరణు...
ఓం గం గణపతియే నమః

శివోహం

శంభో...
ఈ జీవిత డోలన ఆవర్తన కాలం నీ చేతిలోనే ఉంది...
నా దేహ దేవాలయానికి ధర్మకర్తవు నీవు....
నీ అనువర్తనం నేను...
నను నడిపించే నాధుడవు నీవే పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు.

Sunday, September 12, 2021

శివోహం

ఈ దేహ ధ్యాస ఉండదు..
ఏ పనిలో చిత్త ముండదు...
ఇది కావాలని ఉండదు..
నిన్ను తప్ప ఏదీ కోరదు...
ఏమీ చేతు రా శివ ఏమి చేతురా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నీకు ఎన్నో వేల పేర్లు ఉన్నాయని వారు వీరు చెప్పంగా వినిఉంటి...

కాని అందులో శివ అనే పేరు మాత్రమే నా గుండెల్లో నిండుగా మెండుగా దండిగా పేరుకొని పోయింది...

నీ గురించిన తత్వ భావ సంపద నేనెరుగను..

సర్వజ్ఞుడువి నీవు నీ వద్ద ఏం దాచగలము చెప్పు...

మహాదేవా శంభో శరణు...

Saturday, September 11, 2021

శివోహం

సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ...
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ...
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ...
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ...
నీవే శరణు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం. 
ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.   జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు ఓంకార దివ్యస్వరూపుడు గణనాథుడు.
సర్వ విఘ్నములను తొలగించే సిద్ది వినాయకుడు.  సత్వర శుభాలను ప్రసాదించే శుభంకరుడు విఘ్నేశ్వరుడు.
ఓం గం గణపతియే నమః.

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల