Saturday, September 18, 2021

శివోహం

శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతమును మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .

Friday, September 17, 2021

శివోహం

చక్కని వాడవయ్యా...
చిక్కులను తొలగించవయ్యా...
నిక్కముగా తెల్పుతున్నామయ్యా...
మక్కువగా ప్రార్ధిస్తున్నమయ్యా తండ్రి...
సమస్తలోక మానవులు అది పూజగా కొలిచే శ్రీవిఘేశ్వరాయ నీవే శరణు...

ఓం గం గణపతియే నమః.

శివోహం

శివ...
నాలో జీవుడు నీవు ఆడుకునే బొమ్మ అనేనా
నా వెనక నుండి నన్ను పరుగెత్తించి
నీ ఒడిని చేర్చుకుంటూ
నేలను పడవేస్తున్నావు
ఎన్నాళ్ళు ఈ ఆటలు శివా
నీ బొమ్మ నీ దగ్గరే ఉంచుకో

మహాదేవా శంభో శరణు.

Thursday, September 16, 2021

శివోహం

వినాయక...
నీ రంజిల్లు మోమోముతో...
సర్వోన్నత భూషణ మకుటంతో...
విష పన్నగ ఆభారణములతో...
శాంతమైన గజస్వరూపముతో
కరుణామృత దృష్టితో...
దృష్టులను అణిచే ఆయుధములతో...
మూషిక వాహముపై ఏతెంచి...
మా పూజలను స్వీకరించి ఆశీర్వదించి...
మేము పెట్టు ఫలాలు ఉండ్రాళ్ళు ఆరగించవయ్యా ఉమాపుత్ర...

ఓం గం గణపతియే నమః

Wednesday, September 15, 2021

శివోహం

శివా!నీ కోసం వెలుగులో వెతికే వెర్రి వాడను
చీకట్లో నిన్ను  చూడ తెలియని వాడను
చూడ తెలియవయ్యా చుక్కాని నీవయ్యా.
మహేశా . . . . . శరణు .

శివోహం

జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు. నిందలను, విఘ్నాలను తొలగించి ముక్తిని ప్రసాదించే గణనాధుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.

ఓం గం గణపతియే నమః

శివోహం

మంచి మాట మూట ఒకటి మన భుజాలపై ఉండునట...
మన పాపము హరించుకొలదు చిన్నదై దైవానికి దగ్గరగా వెడతాము...
అది ఇరుముడియో...
ఇడుముల ముడియో...
ముడివిప్పి నామడిని శుభ్రము చేయవయా శంకరా...
నను కాయవయా పశుపతీ పరమశివా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...