Sunday, September 19, 2021

శివోహం

శివ...
కనుల కనిపించే కాంతులు...
కనులు మూసి పిలిచిన వేళ....
గుండె గోడల అగుపించు...
మనసు తెరల మాటునుండి చూస్తాను...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నీ నామస్మరణ తలపులలో నిలిచి గూడుకట్టుకున్నవి...
నీనామ జపంలో సర్వం మరచి మనసులో మైమరచి ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందుతున్న వేళ మౌనం సామ్రాజ్యం ఏలుతూ స్మరణ మనన ధ్యాన ధ్యాసలు నలుదిశలుగా భావించే భాగ్యం కలిగించవా...

నీరూపం చూడగానే నా మనసు నీవలే ఘడియైనా నిలిచేలా దీవించు తండ్రీ...

మహాదేవా శంభో శరణు.

Saturday, September 18, 2021

శివోహం

గణేశా...
గుణాతీతమైన త్రిమూర్తి స్వరూపము నీవని
భగవద్ జ్ఞానం కోసం అర్ధించుచున్నాము...
నీ కృపా కటాక్షములను మాపై ఉంచుము...

ఓం గం గణపతియే నమః

శివోహం

నా గుండె గూటిలో ఉన్నది నీరూపమే మహాదేవా.. 
నాలుగు గదులు మీరు నలుగురు...
ఊపిరి నందితో నేననునిత్యం నీ
రూపాన్ని నాగుండెపై చిత్రించుకుంటాను...
నిదురలో మెలకువలో మీరే నా ధ్యాస
చెరగనీయకు నీ చిత్రాన్ని
చెదరనీయకు నా హృదయాన్ని

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతమును మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .

Friday, September 17, 2021

శివోహం

చక్కని వాడవయ్యా...
చిక్కులను తొలగించవయ్యా...
నిక్కముగా తెల్పుతున్నామయ్యా...
మక్కువగా ప్రార్ధిస్తున్నమయ్యా తండ్రి...
సమస్తలోక మానవులు అది పూజగా కొలిచే శ్రీవిఘేశ్వరాయ నీవే శరణు...

ఓం గం గణపతియే నమః.

శివోహం

శివ...
నాలో జీవుడు నీవు ఆడుకునే బొమ్మ అనేనా
నా వెనక నుండి నన్ను పరుగెత్తించి
నీ ఒడిని చేర్చుకుంటూ
నేలను పడవేస్తున్నావు
ఎన్నాళ్ళు ఈ ఆటలు శివా
నీ బొమ్మ నీ దగ్గరే ఉంచుకో

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...