Friday, September 24, 2021

శివోహం

శంకరా...
కష్టము నిను తలచుట..
కష్టము నిను విడిచి మనుట...
కష్టము నిను తలుచుట...
కష్టము నిను గుర్తెరుగుట...
ఈ కష్టము ఇష్టము చేయుము కదా శివ...
మహాదేవా శంభో శరణు.

Thursday, September 23, 2021

శివోహం

నీపైన అపార నమ్మకం తో ఈ సంసార సాగరం ఈదుతూ, నిత్యం నిన్ను ధ్యానించు కొంటూ...

కర్తవ్య నిర్వహణలో తలమునకలై ఉన్న నన్ను మరచి , ఏమార్చి వెళ్ళవు గదా...

తండ్రి!ఆ స్మశానం లో బంధుమిత్రులు వదిలి వెళ్ళాక, నీ సాంగత్యం నాకు దొరుకుతుందనే ఒకే ఒక ఆశతో కాలాన్ని వెళ్ళదీస్తున్నాను!

మహాదేవా శంభో శరణు....

శివోహం

కష్ట, సుఖాలలో నాకు తోడుగా ఉన్న ఆత్మ బంధువు నీవే శివ...
నీ నామమే నను నడుపుతున్న బలం...
కృతజ్ఞతలు శివా!
మహాదేవా శంభో శరణు.

Wednesday, September 22, 2021

శివోహం

నిన్ను పూజించి కొలువ నా చేత కాదు...
నిన్ను ధ్యానించి స్మరియించ అస్సలు వీలు కాదు...
నిన్ను ఊహించి భావించ నా తరము కానే కాదు...
నిన్ను పట్టుట ఎలా శివ ఆ విధము చెప్పుమా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
ఏమీ చేయను...
నా మాట  మనసు వినదు
ఏమి తెలియని కోతి వలె గెంతుచుండును...
ఏమి చేసినను తిక్కగా నన్నె వెక్కిరించుచున్నది...
ఏమి చేయక నిన్నే శరణు వేడుతున్న...

మహాదేవా శంభో శరణు.

Tuesday, September 21, 2021

శివోహం

శంభో...
నాకు నీ కన్నా గొప్ప ఆప్తుడు లేడు... 
నిన్ను మించి మంచి మిత్రుడు లేడు... 
నీవు తప్ప నా కష్టసుఖాలు చెబితే 
వినేది ఎవరు శంకరా...
నిన్ను తప్ప అన్యము ఎరగను...
నీవు తప్ప అన్యము లేదు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
గుప్పెడు కూడా లేని నా గుండె...
నీకు ఓ ఆలయం అయింది...
నీ మైమరపులో నా మనసు మునిగి...
నీ తన్మయత్వంతో తేలియాడుతుంది...
మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...