Wednesday, September 29, 2021

శివోహం

ఉన్న నాలుగు నాళ్ళు ఏవో నాలుగు కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాను శివ...

కాదనకు తండ్రి...

చివరికి చేరుకునేది నీ ఒడికే కదా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

Tuesday, September 28, 2021

అమ్మ

సర్వరూప కారిణి...
జగత్ జనని..
తేజో రూపిణి...
సర్వం నీవై ఉన్న విశ్వమంతా నిండివున్న శివశక్తి నీవే...
అమ్మ మాయమ్మ నీవే శరణు...

శివోహం

శివా!కాలమన్నది కరగి పోవును
కర్మ బంధము  కాలి పోవును
మన బంధమే శాశ్వతము
మహేశా.....శరణు.

శివోహం

శివ...
నీ జటాఝూటం నుండి ఉరుకుతున్న గంగమ్మ...

నిను విడవలేక విచారంగా వుందేమో...

అందుకేనేమో...

నా కనుల కొలను నుండి కన్నీటి రూపంగా నిను స్మరిస్తూ బయటకు వస్తోంది.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నా కనీటి బాష్పల చాటు...
దాగున బాధల పై ఒట్టు...
నా హ్రుధయం దారులు అన్ని...
నీ భక్తి తో అణువణువు నిండి ఉంది...
మహాదేవా శంభో శరణు...

Monday, September 27, 2021

శివోహం

శివా!చెట్టు కింద స్వామి గుట్టు విప్పవేమి
మౌనమైన బోధలో వున్న మర్మమేమి
ఆత్మబోధ అందువా పరమాత్మ బోధ అందువా
మహేశా . . . . . శరణు

శివోహం

శివ...
నేను నిన్ను నిత్యం చూస్తూనే ఉన్నా ఎందుకో తనివి తీరడం శివా...

మనసుపెట్టి ఓ నిమిషం చూసే భాగ్యం కలిగించు...

నిను చూసే లోపు ఆలోచనలు అడ్డు వచ్చి మనసును దారి తప్పిస్తున్నాయి....

నిత్యం నిన్ను ఆరాధించే అదృష్టం కలిగించు సర్వేశ్వరా.  

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...