Friday, October 1, 2021

శివోహం

దైవ నామస్మరణ వల్ల భక్తుడి హృదయంలో భక్తిభావన వెల్లివిరుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, నిర్మలత్వం సంతరించుకోవాలన్నా భగవంతుణ్ని స్మరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ భారతావనిలో ఎందరెందరో భక్తులు భగవంతుణ్ని స్మరిస్తూ తమ కర్తవ్యాన్ని నిష్ఠతో చేసి జన్మను సార్థకం చేసుకున్నారు. దైవనామ స్మరణ మనిషిలోని మాలిన్యాన్ని క్షాళన చేసి ధర్మమార్గం వైపు నడిపిస్తుంది..

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ఙ్ఞానం అనే కాంతితో ప్రకాశిస్తూ వెలుతురును తన స్వరూపంగా కలిగి ఉండే పరమశివుని తలచుకున్నవారికి అజ్ఞాన దాహకత్వము అయిపోయి మోక్షమును పొందుతారు...
అందుకే దేవతలందరిలోను పరమశివుడు మహాదేవుడై ప్రకాశిస్తాడు...
మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి మోక్షమును కలుగజేయమని పరమశివున్ని ప్రార్థిద్దాం.

ఓం శివోహం...సర్వం శివమయం

Thursday, September 30, 2021

శివోహం

శివా!నీనుండి విడివడి నేను
విశ్వమంతా తిరుగుతున్నా
నీ ఒడిని చేరగ వెతుకుతున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

ఒకరు ఎదురుగా...
మరొకరు పాదాల దగ్గర...
ఇంకొకరు గుండెల్లో చోటిచ్చారు.. 
మరి నీవేమో నిలువెత్తు శరీరంలో అమ్మకు
సగమిచ్చి అదే మాకు అనువంశికత చేసావు...
ఇరువురొక్కరై మాకు బలాన్నిస్తున్నా నీ బలం మా అమ్మయే కదా తండ్రి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నేనే నువ్వు కదా...
నాబరువంటే నీ బరువే కదా..
పేరుకు దేహం ఇచ్చావు కానీ యజమానివి నీవే కదా శివ...
బలం నీదే బలగం నీదే...
మోసి నిలిపితే నేలపై దించేస్తే నీ లోగిలిలోకి...
ఏదైనా  నీ దయే కదా శివ...
మహాదేవా శంభో శరణు.

Wednesday, September 29, 2021

శివోహం

శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతము మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .

శివోహం

రారా అనరా శివ...
నన్ను నోరరా రారా అనరా శివ...

నిత్యము నిన్ను పూజింతుముగా ఇలలో ఇలవేల్పువుగా
అందుకే రారా అనరా శివ...

నరుని జీవితము ఒక నాటకము ఇక్కడ
అడలేను రా శివ నేను ఈ కపట నాటకము...
నరుని కోరికలు నిత్య నూతనము...

అందుకె అనరా శివ రారా యని ఒక్కసారి...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...