Tuesday, October 5, 2021

శివోహం

శివా!మునుపెరుగనవి ఎన్నెన్నో మౌనంలో తెలిసాయి
తెలిసాక మౌనం పై పెరిగింది మోహం
మౌనం పెరగనీ మోహం తరగనీ
మహేశా . . . . . శరణు .

Monday, October 4, 2021

శివోహం

కర్మ ఫలితాన్ని ఎవరూ కూడా నశింపజేయలేరు... భగవంతుడు కూడా కర్మఫలితాన్ని తొలగించలేడు... ఆయనకు ఆ శక్తి లేక కాదు, మనకి తగిన అర్హత లేక! కానీ ఎన్ని కష్టనష్టాలు ఎదురైననూ తనను మరువకు, విడువక శరణాగతులై ఉన్నవారి కర్మ ఫలాన్ని మాత్రం కుదించగలడు. ఈ కుదింపు కూడా వారి వారి సాధనపై ఆదారిపడి ఉంటుంది. తనను శరణు అన్నవారికి ఒక కుక్క కాటు వలన కలిగే బాధను చిన్న చీమ కాటుతో సరిపెడతాడు. కత్తి పోటు వలన కలిగే నొప్పిని కాలి ముల్లుతో సరిపెడతాడు. విశ్వసించాలి. అద్భుతాలను చూపిస్తాడు...
ఓం శివోహం...సర్వం శివమయం

Sunday, October 3, 2021

శివోహం

నీ జగన్నాటక చదరంగం లో ఇలా మమ్మల్ని పావులుగా మార్చి ఆనందంగా ఆడుకుంటూ లీలగా వినో దిస్తూ మాలో అంతర్యామి గా ఉంటూ మాతో కర్మలు చేయిస్తూ అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ పావులను కదిలిస్తూ ఎక్కడో ఎప్పుడో అయిపోయింది అంటూ చివరకు తెర దించేస్తు ఉంటావు...
మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు ఇదంతా ఏమిటి స్వామీ...
అంతులేని ఈ కథ కు అంతు పలకవా తండ్రి....
శివ !ఇక మా వల్ల కాదు అలసిపోతూ ఉన్నా దయచేసి విశ్రాంతి కల్పించు...

మహాదేవా మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!ఏకోన్మఖముగ ఎదగాలి
ఏకాక్షితొ నిన్ను చూడాలి
అందుకు నేనేంచెయ్యాలి
మహేశా . . . . . శరణు .


శివా! చిత్తంలో చిరు జ్యోతివి
బాహ్యంలో బ్రహ్మాండ తేజానివి
అంతటా ఉన్నావు అగుపించకున్నావు
మహేశా ..... శరణు.


శివా!మా ఆలోచనల నిండా నీవు
మా లోచనముల నిండా నీవు
ఏ చలనము లేకుండా అమరివున్నావు .
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...

బ్రతకమని నీవు మనిషి జన్మ ఇస్తే...

నేనేమో నటిస్తున్న...
ఇక చచ్చేదాక నటించడమే జరుగుతుందేమో ...

ఇక బ్రతికేదెప్పుడు నీ నామ స్మరణ తో

మహాదేవా శంభో శరణు

Saturday, October 2, 2021

అయ్యప్ప

శంకరహరి పుత్ర...
శశిభాస్కర నేత్ర...
శరణు కోరువారిని కరుణించే దేవధిదేవా...
శబరిగిరి నిలయ వాసా అయ్యప్ప శరణు...

ఓం శ్రీస్వామియే శరణం ఆయ్యప్ప
ఓం నమః శివాయ

శివోహం

ఆది మధ్యాంత రహితుడవు...
సర్వలోక రక్షకుడవు...
అధినాయకుడవు...
ఆది దేవుడవు...
కైవల్య ప్రదాతవు నీవే కదా శివయ్యా...
నీవే శరణు నీదే రక్ష...
నీ నామస్మరణ తో , ఈ సంసార నౌకను దాటించి, మాకూ కైవల్యం ప్రసాదించు తండ్రీ...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...