Wednesday, October 6, 2021

శివోహం

శివ...
ఎన్ని మారులు నీ గుడికి వచ్చి ఉంటి...
ఎన్ని మారులు నీ ముందు నిలిచి ఉంటి...
ఎన్ని మారులు నిన్ను మరవక దలచి ఉంటి...
మహాదేవా శంభో శరణు...

Tuesday, October 5, 2021

అమ్మ

తల్లిని పూజించే చేతులే చేతులట..
ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట...
పారాయణకే పరవశ మొంది భక్తుల బ్రోచేతల్లి దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

ఆహ్వానిద్దాము...
అమ్మ ను ఆహ్వానిద్దాము..
సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దాము...
శ్రీ లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దాము...
మనసారా అమ్మను కొలిచి హారతులిద్దాము...
నవ రాత్రులలో దశ రాత్రులలో కొలిచే తల్లి...
మన అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు , పెద్దలకు , గురువులకు దేవి నవరాత్రులు , బతుకమ్మ శుభాకాంక్షలు

శివోహం

ఎన్ని నటనలు చేసిననో ఇంత వరకు...
ఎన్ని నటనలు చేయవలెనో ఇంకా...
ఎన్ని నటనలు నే జేతునయ్య నటనాగ్రేసరా దీనికి అంతేలేదు...
ఎన్ని జన్మలు నటియించ నీ కృప  కలుగునో శివ...

మహాదే శంభో శరణు.

శివోహం

శివా!మునుపెరుగనవి ఎన్నెన్నో మౌనంలో తెలిసాయి
తెలిసాక మౌనం పై పెరిగింది మోహం
మౌనం పెరగనీ మోహం తరగనీ
మహేశా . . . . . శరణు .

Monday, October 4, 2021

శివోహం

కర్మ ఫలితాన్ని ఎవరూ కూడా నశింపజేయలేరు... భగవంతుడు కూడా కర్మఫలితాన్ని తొలగించలేడు... ఆయనకు ఆ శక్తి లేక కాదు, మనకి తగిన అర్హత లేక! కానీ ఎన్ని కష్టనష్టాలు ఎదురైననూ తనను మరువకు, విడువక శరణాగతులై ఉన్నవారి కర్మ ఫలాన్ని మాత్రం కుదించగలడు. ఈ కుదింపు కూడా వారి వారి సాధనపై ఆదారిపడి ఉంటుంది. తనను శరణు అన్నవారికి ఒక కుక్క కాటు వలన కలిగే బాధను చిన్న చీమ కాటుతో సరిపెడతాడు. కత్తి పోటు వలన కలిగే నొప్పిని కాలి ముల్లుతో సరిపెడతాడు. విశ్వసించాలి. అద్భుతాలను చూపిస్తాడు...
ఓం శివోహం...సర్వం శివమయం

Sunday, October 3, 2021

శివోహం

నీ జగన్నాటక చదరంగం లో ఇలా మమ్మల్ని పావులుగా మార్చి ఆనందంగా ఆడుకుంటూ లీలగా వినో దిస్తూ మాలో అంతర్యామి గా ఉంటూ మాతో కర్మలు చేయిస్తూ అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ పావులను కదిలిస్తూ ఎక్కడో ఎప్పుడో అయిపోయింది అంటూ చివరకు తెర దించేస్తు ఉంటావు...
మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు ఇదంతా ఏమిటి స్వామీ...
అంతులేని ఈ కథ కు అంతు పలకవా తండ్రి....
శివ !ఇక మా వల్ల కాదు అలసిపోతూ ఉన్నా దయచేసి విశ్రాంతి కల్పించు...

మహాదేవా మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...