Sunday, October 10, 2021

అమ్మ

అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి
అభయహస్తమునిచ్చి ఆశీర్వదించుమా...
వెండికొండపైన వెలసినావమ్మా
ఇంటింట ఇలవేల్పుగా నిలిచినావమ్మా ...
నీ పేరు తలచిన చాలు జరిగేను శతకోటి కళ్యాణాలు....
మముగన్న మా తల్లి అమ్మ దుర్గమ్మ శరణు.

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

ఈ లోకములో ఎవరికి వారే స్వతంత్రులు
ఒకరి మీద మరొకరికి ఎటువంటి అధికారములు లేవు.. 
ఈ లోక సంబంధాలన్నీ కేవలం దైవ భావనతో దైవ ప్రేమతో అవసరానికి వాడుకొని వదిలేసేవే
చివరకు ఒంటరిగా ఈ లోకానికి వచ్చిన తాను ఒంటరిగానే మిగిలిపోవలసిందే...

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, October 9, 2021

శివోహం

పరమేశ్వరి
అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి 
శ్రీ భువనేశ్వరి
రాజ రాజేశ్వరి
అజ్ఞాన అంధ వినాశ కారిణి
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
మాత మము ఆదరింపు

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివా! ఈ బ్రతుకు బండికి......
ఎద్దు ఎనుబోతుల జోడీ  ఏమిటయ్యా
ఏదో ఒకదానిని  కూర్చవయా
మహేశా......శరణు.

శివోహం

పుట్టుకతో నేనెరుగని తప్పులన్ని....
నాతో చేయించే ఆ తప్పు నీదే కద...
ఇకనైనా అపు తండ్రి నీ లీలలు నీ నాటకాలు....
అణువణువునా నిన్నే నింపుకోని.....
నికై బతుకుతున్నా నేను....
నా కన్నీటితో నిన్ను అభిషేకించన.....
మరమర మరుగుతున్న నా రక్తంతో అభిషేకించన....

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, October 8, 2021

గోవిందా

భగవంతుడు నిర్గుణుడు కాడు
అనంత కళ్యాణ గుణ సంపన్నుడు
దయాది సకల శుభ గుణ శోభితుడు
భగవంతుడు నిరాకారుడు కాడు
భువన మోహన సుందర మూర్తి
దివ్య మంగళ విగ్రహుడు
భగవంతుడు కేవలమొక శక్తి మాత్రమే కాదు
అతడు మన వలెనే మంచి భావాలకు వెంటనే 
ప్రతి స్పందించే వ్యక్తి కూడా...

ఓం.నమో వేంకటేశాయ
ఓం నమః శివాయ

ఆమ్మ

ఓంకార రూపిణి 
శుభదాయని
జగదేక మోహిని
ప్రకృతి స్వరూపిణి
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...