Saturday, October 16, 2021

శివోహం

శంభో...
నీవు నా తోడుండగా
పోరాటమేమిటి...
మరణానికైనా సిద్ధమే...
మహాదేవా శంభో నీవే శరణు.

Friday, October 15, 2021

శివోహం

పరమేశ్వరా!!!!!ఏమి కోరను 
ఇచ్చితివి నాకిల సుందర దేహము
అంతో ఇంతో విజ్ఞానము
కడుపు నిండుటకు సరిపడు అన్నము
పలికే ప్రతి మాట నీనామ మవనీ
తలిచే ప్రతి తలపు నీ భావమవనీ
వేసే ప్రతి అడుగు నీవైపె సాగనీ
చూసే ప్రతిచూపు నీరూపుపై నిలపనీ
మహాదేవా శంభో శరణు...

శివోహం

దేవుడు నాకు ఇది ఇచ్చాడని...
ఇది ఇవ్వలేదని ఆయన పట్ల నిర్లక్ష భావముతో ఉండ కూడదు...
లేచిన తర్వాత , పడుకొనేముందు కనీసము ఆ రుద్ర మూర్తిని తలుచు కొంటే మనము తెలిసో తెలియకో చేసిన పాపాలు పోతాయని...

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, October 14, 2021

శివోహం

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం  సబ్యులకు పెద్దలకు గురువులకు విజయదశమి శుభాకాంక్షలు.

సర్వ శక్తిమయి
శత్రు సంహరిని
శూల ధారిణి   
శ్రీచక్ర వాసిని.   
సర్వ కారిణి     
శాంత రూపిణి. 
కాంత రూపిణి   
జ్ఞాన ప్రదాయిని 
జ్ఞాన రూపిణి
శుభ అభయ నభయములు కూర్చు అమ్మలగన్నయమ్మ శివుని దేవేరి తల్లి నీవే శరణు...

ఓం శ్రీమాత్రే నమః.


శివోహం

శివా!మాంస నేత్రము మూసి ఉంచలేను
జ్ఞాన నేత్రము తెరిచి చూడలేను
మాంస నేత్రము మరపించు జ్ఞాన నేత్రము తెరిపించు
మహేశా. . . . . శరణు.

......

శివోహం

శివ...
నీవెంత దూరంలో ఉన్నా నీ చెంతనే నిలబడి నిన్ను ప్రార్ధిస్తున్నాను.. 
ఎందుకంటే నీవే నాకు పెన్నిధి...
వీడను నీ సన్నిధి...

మహాదేవా శంభో నీవే శరణు.

శివోహం

శివా!తిక్క తలకెక్కగ మేము
తిక్క శంకరుడని నిన్ను అంటున్న వేళ
మా తలతిక్క దిగనీ నిన్ను తెలియనీ
మహేశా . . . . . శరణు .


శివా! "నిన్న" "రేపు" చింత ,నన్ను చుట్టెరా 
ఆ చింతలోనె నేడు అంతా గడిచిపోయెరా
ఆ చింతలన్ని త్రుంచరా, నీ చెంత చేర తెలుపరా
మహేశా ..... శరణు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...