Thursday, October 21, 2021

శివోహం

శంభో...
నా బతుకు అంకెల గారడీ...
కూడికలు తీసివేతలు ఎన్ని వేసినాఎం..
ఎక్కాలు ఎన్ని పైనుండి కిందకు... 
కిందనుండి పైకి వల్లే వేసినా... 
గుణకారాల్లోను కుదింపులే...
భాగాహారాల్లోను శేషాలే....
గజిబిజి గందరగోళంలా ఉంది నా జీవితం...

మహాదేవా శంభో శరణు.

Wednesday, October 20, 2021

శివోహం

అఖిలాండకోటి బ్రహ్మాణ్డ నాయకా శరణు... సర్వాంతర్యామి శరణు...
పరంధామా పరాత్పరా  నీవే శరణు...
పరమేశ్వరా శరణు...

ఓం నమో వెంకటేశయా...
ఓం నమః శివాయ.

శివోహం

అస్త్రము తెలీదు , శస్త్రము తెలీదు 
శాస్త్రము అసలే తెలీదు 
నిమిత్త మాత్రుణ్ణి , నిర్నీత సమయాన్ని 
సద్వినియోగ పరుచుట తప్ప 
నాకు ఏమీ తెలియదు శివ కానీ
హృదయ పూర్వకముగా నిన్నే ఆరాధిస్తున్నా

మహాదేవా శంభో నీవే శరణు...

శివోహం

శివా!నీవు కన్ను తెరిచి మూసినంత కల్పాంతం
నేను కన్ను తెరిచి మూసినంత జన్మ అంతం
ఆద్యంతములు లేని నీవే నిత్యం సత్యం
మహేశా. . . . . శరణు.

శివోహం

భక్తికి అహం అతి పెద్ద ప్రతి బందకం... 
ఎందుకంటే అది తాను శరణాగతి చేయకుండా అది తరుచు అడ్డుపడుతుంది... 
అందుకే మానవుడు అహాన్ని నశింపజేసుకున్నపుడు మాత్రమే ఈశ్వరునికి నిజమైన శరణాగతి చేయగలడు... 
మాటిమాటికి ఈశ్వరుని గురించి ఆలోచించడం మరియు గురువు చెప్పిన ఆధ్యాత్మిక మార్గం లో కచ్చితమైన సాధన చేయడం అనేది దీర్ఘకాలం లో అహాన్ని నసింపజేసి భక్తిని పెంపొందిస్తారు... 

ఓం శివోహం సర్వం శివమయం

Tuesday, October 19, 2021

శివోహం

భగవంతుడు మనతో నిరంతరం అత్యంత సన్నిహిత సంబంధంతో మెలిగే ఒక అద్భుత మహిమ గల వ్యక్తి అని వెంటనే గుర్తించండి...
అప్పుడు మీరు అతనిని ఒక సాటి మిత్రుడైన వ్యక్తిగా దర్శించగలరు...
దేవుడు తనంత తానుగా మనిషిని మార్చడు...
కానీ మనిషి తనను ప్రార్థిస్తే అతడికి తన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!ఇద్దరం చెరొకటీ తీసుకుందాం
నిన్ను కొలిచే భాగ్యం నాకు
నన్ను కాచే భారం నీకు....సరేనా.
మహేశా ..... శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...