Saturday, November 6, 2021

శివోహం

శివ...
ఏది నిజం...
చూసేదా...
చూడలేనిదా...
చూసేవాడా..
చూపించే వాడా...
తెలిసేదెలా...
చూసేది నేనే ఐన చూపించేది నీవే...
నువ్వు నిజం నేను అబద్దం...

మహాదేవా శంభో శరణు.

Friday, November 5, 2021

శివోహం

శంభో... 
నీ బంధువులంతా...
నాకూ బంధువులే...
నీవు నాకు ఆత్మబంధువు...
మహాదేవా శంభో శరణు...
సర్వేశ్వరా శరణు.

శివోహం

శివా!అసమానతలన్ని ఆవిరైపోగా
భేదములన్ని బూడిదైపోగా
చేర వచ్చేవా నన్ను నీలో చేర్చుకొనగ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
అసలు నేను ఎవరిని...
ఎవరివాడను...
ఎక్కడివాడను...
నా  అడ్రస్ ఎక్కడ...
వచ్చింది ఎక్కడినుండి...
పోవాల్సింది ఎక్కడికి...
ఇంకెంత దూరంలో ఉంటుంది నా మజిలీ...
ఎలా నిన్ను చేరేది...

మహాదేవా శంభో శరణు.

Thursday, November 4, 2021

శివోహం

శంభో...
శివయ్య అంటే అదేదో అనకూడని మాటలా భావిస్తూ ఉంటారు కొందరు...
ఇలా భ్రష్ఠు పట్టిన ఆలోచనలు శుద్ధి చేయడం ఎలా...
శివ నీకు ఈ నామం ఎంత ప్రీతికరమైనదో మాకు తెలుసు...
శివ అన్న పిలుపుకు నీవు ఎంత పరవశించి పోతావో , నీకు ఎంత ఆనందమో నీ భక్తులకు కూడా అంతే ఆనందానుభూతి కలుగుతుంది...

మహాదేవా శంభో శరణు..
సర్వేశ్వరా నీవే శరణు.

శివోహం

శివా!ఈ జీవిని నీ ముందు నిలిపినా
పశువునని ఏ మందను కలిపినా
అది నా భవరోగానికి మందే
మహేశా . . . . . శరణు .

శివోహం

చిన్నా
పెద్దా
ఉన్నవాడు
లేనివాడు అని కాకుండా
కులమత వర్గాలకు తావులేకుండా
మనమంతా ఒకటే ఇదే  "దీపావళి పండుగ "కు సూచిక...

ఓం శివోహం... సర్వం శివమయం 

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...