Thursday, November 11, 2021

శివోహం

శంభో...
విశ్వంలో నేను అణు మాత్ర పరిమాణంలో ఉన్నాను...

ఈ విపత్కర పరిస్థితుల్లో గుట్టలు గుట్టలుగా వస్తున్న నీ భక్తుల సమూహంలో నన్ను నీ ఒడిని చేర్చుకో...

ఈ సువిశాల ప్రపంచంలో ఎక్కడని వెతకను...
అంతటా ఉన్న నీవు నాలోను ఉంటావు కదా...
నిన్ను వెదికే లోపు జీవిత నాటకానికి తెర పడిపోతే నీదే భారం పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.
సర్వేశ్వరా శరణు.

శివోహం

శివా!తెలియక వేసేను కోర్కెల విత్తు
దానికి కలిగేను విషయ వాసనల పొత్తు
కూడి చేస్తున్నాయి నా బ్రతుకు చిత్తు
మహేశా . . . . . . శరణు.

శివోహం

శంభో...
అమ్మనాన్నలా కన్నా బిడ్డల...
సుఖము కోరుకునే వారెవ్వారు...
మేలు చేసే వారెవ్వారు...
రక్షణ ఇచ్చేవారెవ్వారు...
అందుకే నా రక్ష నువ్వే ....
నా రక్షణ నువ్వే ...
నన్ను కాచేవాడివి నువ్వే ...
నన్ను బ్రోచేవాడివి నువ్వే ...

మహాదేవా శంభో శరణు.
సర్వేశ్వరా శరణు.

శివోహం

సత్యం శివం సుందరం...
సత్యం అంటే శాశ్వతం...
శివం అంటే  జ్ఞానం...
సుందరం అంటే ఆనంతమైన ఆనందం...
అదే పరమానందం...

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, November 10, 2021

శివోహం

భగవానునిపట్ల అమితమైన ప్రేమే భక్తి...
భగవానుని దివ్యలీలలయందు,మహిమలయందు, గుణగానంలయందు,నామసంకీర్తనలయందు దైవవిషయాలు శ్రవణమందు మనస్సును లగ్నం చేయుటయే భక్తి....
భక్తి ప్రాప్తించుటకు విద్య యొక్క ఆవశ్యకత లేదు...
ఉన్నత వర్ణాశ్రమములు అవసరం లేదు....
ధనం అవసరం లేదు....
వేదాధ్యయనం, తపస్సులు అక్కరలేదు....
అపారమైన విశ్వాసముతో నిరంతరం భగవంతున్ని స్మరిస్తే చాలు.

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!క్షేత్రము చత్రము నీవే
మననమున నామ మంత్రములూ నీవే
తుదకు నువ్వు.,నేనూ...నీవే
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
నా కళ్ళను కప్పిన అహంకార మమకార మాయా మోహ పొరలు తొలగించు...
నీపై బుద్దిని...
నీ కథలను శ్రవణం చేసే చెవులను...
నిన్ను మాత్రమే స్తుతించే నోరును...
నీ దివ్యరూపాన్ని తిలకించేందుకు యోగ్యమైన కన్నుల చిత్తశుద్ధిని నాకు అనుగ్రహించు...
నీవు దయతో ఇచ్చిన నా ఈ జన్మకు నీవే విలువ కట్టి నీ సన్నిధిలో ఉంచుకో...

మహాదేవా శంభో శరణు...
సర్వేశ్వరా శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...