Sunday, November 14, 2021

శివోహం

శంభో...
పాడు మనసు ఒకే చోట నిలవడం లేదయ్యా...
నాజీవిత లోలక కంపన పరిమితిని స్థిరపరచి...
ఊపిరి ఊయలలో నీ నామం స్మరించేలా చేయవా...

మహాదేవా శంభో శరణు...
సర్వేశ్వరా శరణు.

శివోహం

శివా!నీ పేరులన్ని పేరులా కూర్చేను
పేరు పేరున ఆ పేరు పరిమళించేను
ఆ పేరు నీ మెడలోన వేసి మరిసేను
మహేశా . . . . . శరణు .

Saturday, November 13, 2021

శివోహం

అయ్యప్పా నీకు శరణు...
అమ్మవలె దయచూపి...
ఉత్తమ మానవ జన్మను
బుద్ధిని ఆరోగ్యాన్ని ఆయువునీ....
బంధు మిత్ర కళత్ర పుత్ర పరివారాన్ని...
ప్రకృతి ఒడిలో పెరిగే ఫల పుష్ఫ ధాన్యాది ఆహారాలను  జాలితో ప్రేమతో అందిస్తున్న తల్లి ప్రేమ నీది....
హరిహర పుత్ర అయ్యప్పా శరణు...

శివోహం

శివా!బంధాలతో బరిలోకి తోసేవు
బ్రతుకంత బరిలోనే తిరుగ జేసేవు
బంధాలు తెగనిమ్ము బరి దాటనిమ్ము
మహేశా . . . . . శరణు .

శివోహం

నమ్మకం గొప్పదైతే దేవుడు ఎందుకు దిగిరాడు....
ఎంత విశ్వాసమో అంత ఫలితం...
పూజలు వ్రతాలకంటే...
తప్పులు క్షమించి దయయుంచి కాపాడు తండ్రి...
దేవుడా నీవే దిక్కు...
మార్గం చూపు...
నేను అసమర్థుణ్ని...
అవివేకిని...
అజ్ఞానిని...
నేను ఏమిటో...
నాకు ఏం కావాలో...
ఏం చేయాలో తెలీదు..
అన్న ప్రగాఢ మైన మొక్కుకి దేవుడు తప్పక వింటాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, November 12, 2021

శివోహం

శివా!అష్టమూర్తి స్వరూపా
అష్టాంగ యోగాన్ని అందనీయి
దేహాంగముల భ్రాంతి తొలగనీయి
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
ఎన్నిజన్మలు సేవించినా సరిపోని పరమ ఉత్తమమైన   అద్వితీయమైన శక్తిసంబంధం నీ భక్తి...
నేను ఏది చేసినా...
ఏమి చూసినా...
ఎక్కడ ఉన్నా...
ఎంత బాధ కలిగినా....
సర్వం శివమయమే...

మహాదేవా శంభో శరణు.
సర్వేశ్వరా శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...