Thursday, November 18, 2021

శివోహం

తల్లీ
తండ్రి
గురువు
దైవం
అన్నీ నీవే అని నమ్ముకుంటున్న
ఈ దీనులకు మార్గదర్శనం చేసే భారం నీదే ఈశ్వరా...
శరణు శరణు శరణు

Wednesday, November 17, 2021

శివోహం

అంతులేని బంధనాల్లో మనిషిని యిరికించివేసి ఎన్నోవిధాలుగా యిబ్బంది పెట్టే ఆశల పాశాలను తునాతునకలు చెయ్యగలిగేది వైరాగ్యం....
వైరాగ్యం పదునైన కత్తి ఒక్కటే....
శివ నామ స్మరణ...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఆపద్భాందవా...
పంచభూతాత్మకము...
పంచేంద్రియ ప్రకోపితము...
అరిషడ్వర్గాల ప్రభావితము...
పూర్వజన్మల కర్మల వేదితము అవుతున్న ఈ తనువు నా మనసును నీ అదీనము చేయుట నా తరం కావడం లేదు తండ్రి...
నన్ను నీవాడిగా భావించి...
నాకు ఏది యుక్తమో...
ఏది సవ్యమో , ఏది భావ్యమో...
ఆ విధంగా నన్ను తీర్చి దిద్ది నన్ను నీ సన్నిధిలో ఉంచుకో...

మహాదేవా శంభో శరణు.

Tuesday, November 16, 2021

శివోహం

శివా!నీ పేరులన్ని పేరులా కూర్చేను
పేరు పేరున ఆ పేరు పరిమళించేను
ఆ పేరు నీ మెడలోన వేసి మరిసేను
మహేశా . . . . . శరణు .



శివా!కదలగా లేని నీవే మమ్ము కదిలిస్తున్నావు
కనబడని నీవే మమ్ము కనబరుస్తున్నావు
మాకు ఇది చోద్యము నీకే ఇది సాధ్యము
మహేశా  .  .  .  .  .  శరణు  .



శివా!ఈ రథమును కూర్చిన నీవే
సారథినెరిగించు వారధి దాటించు
నిను చేరుట ఎఱిగించు 
మహేశా . . . . . శరణు

శివోహం

అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి...
అభయహస్తమునిచ్చి ఆశీర్వదించు...
నిన్ను నమ్మి కొలిచే భక్తజనాల విశ్వాసాన్ని గోరంత కూడా అది వమ్ము చేయకు తల్లి...

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి
నీవే శరణు.

ఓం శ్రీమాత్రే నమః.

Monday, November 15, 2021

శివోహం

శంభో...
అణువు అణువున వెలసిన నీవు...
మాకు అగుపించేది ప్రకృతిలో...
ఆ ప్రకృతి పరవశములోనే మాకు వినిపించేది నీ ప్రణవనాదమే...
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది...
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహాదేవా శంభో శరణు.
సర్వేశ్వరా శరణు.

శివోహం

శంభో... 
ప్రాపంచిక బంధాల మాయలో పడి నిన్ను మరిచాను....
క్షణిక సుఖమే శాశ్వతమని తలచి నిన్ను మరిచాను.  
అనుభవాలు ఎన్ని ఎదురైనా....
ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి....
వ్యామోహములో పడి చింతిస్తున్న....

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...