Sunday, November 21, 2021

శివోహం

చిత్తశుద్ధి అంటే నీతి నియమాల జాబితా కాదు...
చిత్తశుద్ధి అనేది మీరుండే తీరు...
మీరు ఆలోచించే పద్దతి...
ఇంకా మీరు ప్రవర్తించే విధానం...
                 - సద్గురు జగ్గీవాసుదేవ్

శివోహం

దాచిన ధనం నిన్ను ధనవంతుడ్ని చేస్తుంది...
దానం చేసిన ధనం ధర్మాత్ముడిగా నిలుపుతుంది...
నీవు సంపాదించిన ధనం కాటి వరకైన రాదు...
నీవు  సంపాదించిన ధర్మం దైవం దరికి చేరుస్తుంది.

వి.మహాన్.

Saturday, November 20, 2021

శివోహం

ఈ సృష్టి అంతా ఓంకారమే ఉంది. ఓంకారం రూపంలో గణపతి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు.ఈ సృష్టిలో నిత్యం శబ్దప్రకంపనల ద్వారా అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తత్వమే గణపతి.

ఓం గం గణపతయే నమః

శివోహం

శంభో...
సర్వమూ సమస్తమూ అయిన తల్లిదండ్రులూ మీరు...
అంతటా ఉన్న మిమ్మల ఆలస్యంగా తెలుసుకుంటిని...
ఆలస్యంగా నా ఇంటికి మిమ్మల ఆహ్వానించితినీ.. 
పార్వతీ పరమేశ్వరా ఈ బిడ్డ ను మన్నించండీ...

మహాదేవా శంభో శరణు.

శివోహం

భగవంతుడు బలీయమైన సంకల్పంతో ఈలోకాన్ని నడిపిస్తూ వున్నాడు...
బండ్లను ఓడలు చేయడం, ఓడల్ని బండ్లు చేయడం ఆయనలీల...
ఏదో ప్రాసాదించాడని పరవశించేలోపే మరేదో పట్టిలాగేసుకుంటాడు...
బ్రతుకు ఎడారిలో వైరాగ్య జ్వాలలు రగులుతున్న వేళ ఎక్కడో సుదూరంగా సుఖాల ఎండమావుల్ని చూపిస్తాడు...
మనం ఆశించేది ఒకటైతే, ఆయన శాసించేది మరొకటి. అయితే, అంతిమంగా భగవంతుని ప్రతిచర్య వెనుకో పరమార్ధం దాగి వుందనీ, ఆయన శిక్షలు వేసేవాడు కాదని, శస్త్రచికిత్సకుడేనని అర్ధమౌతుంది. ఆయన చేసే గాయాలు తాత్కాలికంగా బాధించినా, శాశ్వతంగా మనల్ని స్వస్థత పరుస్తాయని విదితమవుతోంది.
స్వామి జ్ఞానదానంద

శివోహం

శంభో...
నాకు తెలిసిన మహా మంత్రం ఓం నమః శివాయ...
నాకేం కోరిక ఉంటుంది తండ్రి...
ఎదో ఒకరోజు నన్ను తీసుకుపోవుటకు
నీవు రాకపోతవా...
నా ఆవేదన తో నీకు నివేదన చేయకపోతానా...
అప్పటి వరకు స్మరణ చేయడం నా వంతు
రక్షించుకోవడం నీ వంతు

మహాదేవా శంభో శరణు...

Friday, November 19, 2021

శివోహం

భగవంతుడు బలీయమైన సంకల్పంతో ఈలోకాన్ని నడిపిస్తూ వున్నాడు...
బండ్లను ఓడలు చేయడం, ఓడల్ని బండ్లు చేయడం ఆయనలీల...
ఏదో ప్రాసాదించాడని పరవశించేలోపే మరేదో పట్టిలాగేసుకుంటాడు...
బ్రతుకు ఎడారిలో వైరాగ్య జ్వాలలు రగులుతున్న వేళ ఎక్కడో సుదూరంగా సుఖాల ఎండమావుల్ని చూపిస్తాడు...
మనం ఆశించేది ఒకటైతే, ఆయన శాసించేది మరొకటి. అయితే, అంతిమంగా భగవంతుని ప్రతిచర్య వెనుకో పరమార్ధం దాగి వుందనీ, ఆయన శిక్షలు వేసేవాడు కాదని, శస్త్రచికిత్సకుడేనని అర్ధమౌతుంది. ఆయన చేసే గాయాలు తాత్కాలికంగా బాధించినా, శాశ్వతంగా మనల్ని స్వస్థత పరుస్తాయని విదితమవుతోంది.
స్వామి జ్ఞానదానంద

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...