Saturday, December 18, 2021

శివోహం

శిక్షించడం దైవ నిర్ణయం కాదు...
పరీక్షించడమే దైవ మార్గం...
చేసిన కర్మలకు పశ్చాత్తాపం పడడమే మనిషి చేయగలిగిన కర్మమార్గం...

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, December 17, 2021

శివోహం

మధురమైన పదార్థం నాలుకకు కొంత సేపే తీపి దనాన్ని అందివ్వ గలదు...
శ్రావ్యమైన సంగీతం చెవులకు కొంతవరకే అస్వాదన కలిగించ గలదు...
చిత్రమైన దృశ్యాలు కళ్ళకు లిప్త కాలం మాత్రం మనో రంజనం చేయవచ్చు...
కానీ...
మనసుతో చేసే శివనామ స్మరణ మనిషికి ఆసాంతం అవధులు లేని ఆనందాన్ని, ముగ్ధ మనోహర మైన మనో రంజనాన్ని అందిస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, December 16, 2021

శివోహం

ఎవరు నన్ను లెక్కలోనికి తీసుకుంటే యేంటి వేరెవరెవరి  లెక్కలలో నేను లేకపోతే యేంటి...

కాలస్వరూపుడవు నీవు...

నీదైన లెక్కలలో నేనెంత వరకూ ఉన్నాన్నదే నాకు ముఖ్యం...

మదినిండా నిను తలుస్తూ మహదానందంగా బ్రతికేస్తాను...

మహాదేవా శంభో శరణు...

Wednesday, December 15, 2021

శివోహం

నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి...
అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు...
ఈ దేహం నాది కాదు...
ఈ ఊపిరి నాది కాదు...
ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు...
అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి...
ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు...
నీ విధులు నువ్వు సాగించు...
నీకు కావలసినంత ప్రశాంతతబ్లభిస్తుంది...

ఓం శివోహం సర్వం శివమయం.

Tuesday, December 14, 2021

శివోహం

మనకు భగవంతుడి పట్ల ఉండే కృతజ్ఞతా భావం, మనం ఆనందంగా జీవించడానికి సహాయపడే మూల సాధనం.
అంతా ఈశ్వరేచ్చ అనే రెండు పదాలతో మొదలయ్యే ఈ ఆనందయాన గమ్యం సచ్చిదానందం...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

నెత్తిన తైతక్కల గంగ...
నుదుటన నిప్పులుమిసే కన్ను...
కంఠాన విషపు కొలిమి మేన కాష్ఠపు బూది చాలవా నీకు...
బహు తిక్కల రేడు వని తెలుప ఈ విన్యాసమేలా...

మహాదేవా శంభో శరణు

Monday, December 13, 2021

శివోహం

శంభో...
పట్టు పంచ విడిచి పులి చర్మాన్ని కప్పుకున్నావు...
నీవెంతటి పేదవాడివో
వజ్ర వైడూర్యాలు వద్దని మెడలో పాముని అలంకరించుకున్నావు...
నీవెంతటి సామాన్యుడివో
రాజువైన ఐరావతాన్ని వదిలి నందిని వాహనంగా పెట్టుకున్నావ్
నీవెంతటి వీరుడివో
భక్తులు పిలిస్తే పరుగున పరిగెత్తుకొస్తావ్ నీవెంతటి దయా హృదయుడవో శివ...

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...