Thursday, December 23, 2021

శివోహం

శంభో
ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నీ కరుణ దీవెనలు మాకు శుభదాయకం...
ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావో నీ ఆశీర్వాదములు మాకు ఆనందాయకం...
నీకై నేను జన్మించాను నాకై నీవు ఉదయిస్తున్నావు
నీలో నేనే నిలిచిపోయాను నాలో నీవే కలిసిపోయావు...

మహాదేవా శంభో శరణు...

Wednesday, December 22, 2021

అమ్మ

అమ్మ
కరుణాసముద్రి...
దయాసాగరీ...
ఆపదల యందు నిన్ను స్మరిస్తున్నానని తప్పుగా భావించకమ్మా...
ఇది సహజమే కదమ్మా తల్లి...
ఆకలిదప్పులున్నప్పుడే...
బిడ్డలు తల్లిని స్మరిస్తారు...

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉనట్టే...
సర్వేశ్వరి నీవే శరణు

శివోహం

శంభో...
నన్ను దిద్దుకో...
సన్మార్గంలో
సద్బుద్ధితో
సద్భావనతో నన్ను నడిపించి...
తరింపజేసే భారం బాధ్యత నీదే...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
 బ్రతుకు భారాన్ని మోయలేని నిస్సహాయుడిని... ఇంకా ఇంకా జన్మలెత్తి పరితపించే ఓపిక లేదు...
ఆ ఇల్లు ఈ ఇల్లు ఎన్నాళ్లు తిప్పుతావు తండ్రి...
కరుణతో ఈ జన్మకి ముగింపు పలికి, నన్ను నీదరికి చేర్చుకో తండ్రి...
మహాదేవా శంభో శరణు.

Tuesday, December 21, 2021

శివోహం

ఈశ్వరుడు అందరిలోనూ సమముగానే ఉన్నాడుగాని, ఈశ్వరునియందు అందరును సమానముగా ఉండుటలేదు. అందుచేతనే ఒకరు భక్తుడుగాను, మరియొకరు బద్ధుడుగాను ఉండుట జరుగుచున్నది.

రామకృష్ణ పరమహంస

శివోహం

నా జీవన పయనం నీ కోసం..
కాలం కరిగిపోయినా...
వయసు తరిగిపోయినా...
చూపు చిన్నబోయినా...
మాట మూగబోయినా...
ఆగను ... ఆపను ...
నడుస్తూనె ఉంటా నిన్ను చేరేవరకు..
పిలుస్తూనె ఉంటా నువ్వు పలికేవరకు...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

శంభో...
క్షణం క్షణం  రంగులు మారే ఊసరవెల్లి లా నే నటించలేను...
మాయదారి నా మనస్సు చెప్పినట్టు నే నటించలేను...
మనస్సులేని మాయనగరంలో అస్సలు నేనుండలేను...

ఉంటే నీతోనే నిలోనే...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...