Tuesday, January 11, 2022

శివోహం

శభరీశ్వర...
పాశాంకుశ ధారి....
పాపధ్వంసకం ధారి....
భవబంధ మోచక ధారి.....
నా మదిని భక్తి తో కరిగించి నీకు కర్పూర హారతిగా అర్పింతును...
నా శరీరం అనే నారికేళం లో అహం అనే నెయ్యి నింపి నీ కొండకు వస్తా...
న అహం ను తొలిగించు నీ ముక్తి మార్గం చూపించు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

శంభో ! సర్వ జ్ఞానివి... 
సమస్త లోకాలను ఏలే వాడవు... 
సకల శుభాలను ఇచ్చేవాడవు... 
సకలమూ ఎరిగిన వాడవు... 
సమస్తమూ వ్యాపించిన... 
ఆనంద తాండవ నటరాజా... 
మాత బాలాత్రిపురసుందరిదేవితో 
కూడి నాకు జ్ఞానఐశ్వైర్యాన్ని ప్రసాదించుము... 
నన్ను అనుగ్రహించుము తండ్రీ... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

కఠిన దుఃఖ బాధలైనా...
గుండెల్లో ఊపిరి భరువైనా...
స్థితి గతులే మారినా...
నీ ఆరాధన ఆపను...
నీ ధ్యానం అపను...

మహాదేవా శంభో శరణు...

Monday, January 10, 2022

శివోహం

నీకై పిలిచి పిలిచి నా స్వరము  తరిగి
పోయినదిరా పమేశ్వరా...
నాకై  నీవు  పిలువగా...
నీ  స్వరము  వినాలని మది...
ఎదురుచూపురా ఈశ్వరా ఇది...

మహాదేవా శంభో శరణు.

Sunday, January 9, 2022

శివోహం

నా శ్వాసే నీవన్న ఎదో ఓ రోజు ఊపిరి తిస్తావు...
నేను బ్రతుకేది నీకోసమన్నా చివరికి చితినే పెరుస్తావు...
నా సొంత వాళ్ల కోసం ఎన్ని కలలు కన్నా కల గానే మిగిలిస్తావు...
చివరకి అన్ని బంధాలు తెంచుకోని నీ దగ్గరికి రమ్మంటావు...
నీ లీలలు తెలియ నా తరమా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఆరాధన అనేది అద్భుతమైన...
అందమైన మధుర భావం....
అది త్రిగుణా తీతం
అలౌకిక ఆనంద భరితం...
అనుభవైక వేద్యం కూడా...

ఓం శివోహం... సర్వం శివమాయం

శివోహం

హనుమా నీ రూపే వేరు...
భక్తికి పరాకాష్ట నీ నడక...
రాముడు లేని చోట నీవుండవు...
శ్రీరామ నామము జపిస్తూ నీవు నడయాడే నేల పవిత్రము...
వీరులకు వీరుడు ఎవరంటే నీవె అతి భయంకర వీరుడవు...
లంకను రావణ చెరనుండి రక్షించిన శ్రీరామ భక్తుడవునీవు...
నన్ను నీ దరికి చేర్చుకోవయ్య శ్రీఆంజనేయ...

శ్రీరామభక్త హనుమ శరణు.
జై శ్రీరామ్... జై జై శ్రీరామ్

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...